ఉత్తమ సేవలు అందించిన పోలీస్ అధికారులకు సేవ పథకాలు
మెదక్ జిల్లాకు 9 పథకాలను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
మెదక్ (తెలంగాణ వాణి) మహోన్నత సేవ పథకం వరించిన జిల్లా అదనపు ఎస్పీ ఎస్ మహేందర్ ఎసై నుండి అదనపు ఎస్పీ గా అంచలంచలుగా ఎదిగిన ప్రస్థానం. ఇటిక్యాల పాడు, మండలం ఉండవెల్లి, జిల్లా జోగులాంబ గద్వాల్ లో జన్మించిన మహేందర్ మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ హిస్టరీ పూర్తి చేయడం జరిగింది. 1987 -1989 ఎన్సిసి/ఎన్ఎస్ఎస్ చురుగ్గా పాల్గొని పలు సర్టిఫికెట్లు అందుకున్నారు. 16-01-1989 ఎస్సైగా ఉద్యోగం సాధించి పోలీస్ ట్రైనింగ్ కళాశాల అనంతపూర్ లో శిక్షణ పూర్తి చేసిన మహేందర్ ఎస్ఐగా కరీంనగర్ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో పనిచేశారు. 04-08-2005 సంవత్సరంలో సీఐగా ప్రమోషన్ పొంది కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలో పనిచేశారు. 21-07-2014 డీఎస్పీ/ఏసిపి గా ప్రమోషన్ పొందారు. మామునూర్ ఏసిపి, సిఐడి కరీంనగర డీఎస్పీగా, హుస్నాబాద్ ఏసిపిగా దీర్ఘకాలంగా పనిచేసి హుస్నాబాద్ డివిజన్ ప్రజల మన్ననలను పొందారు. 21-04-2021 నాడు అడిషనల్ ఎస్పీగా/అడిషనల్ డీసీపీగా ప్రమోషన్ పొంది ఆ రోజు నుండి ఈరోజు వరకు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ గా విజయవంతంగా విధులు నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గతంలో 2010 సంవత్సరంలో సేవా పథకం. 2018 సంవత్సరంలో ఉత్తమ సేవా పొందారు. 01-06-2025 నాడు మహోన్నత సేవ పథకం వరించింది. తన సర్వీస్ లో మొత్తంగా 100 రివార్డులు/అవార్డులు పొందారు. 02-08-2023 నాడు మెదక్ అడిషనల్ ఎస్పీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. విధినిర్వహణలో సౌమ్యుడు మంచితనానికి మారు పేరుగా నీతి నిజాయితీలు ఆభరణలుగా పేరు తెచ్చుకొని డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.