ఇదేం పద్దతి పెద్దాయన
▪️ పైసా ఖర్చు లేకుండా గుడ్ విల్ లాక్కున్నారుగా
▪️ ఇదేనా మీ జనహిత నినాదం
▪️ SRKT స్కూల్ పై సోషల్ మీడియాపై ట్రోలింగ్
కొత్తగూడెం (తెలంగాణ వాణి)
స్థానిక కొత్తగూడెం మున్సిపాలిటీ 19 వ వార్డు పరిది గొల్లగూడెంలో గత 20 సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వ అనుమతులతో శ్రీ రాగా స్కూల్ నడుస్తుండగా సడన్ గా ఆ బిల్డింగు ఓనర్ స్కూల్ యాజమాన్యాన్ని దౌర్జన్యంగా బయటికి పంపిన సంగతి ఆలస్యంగా వైరల్ అవుతుంది. సదరు బిల్డింగు యాజమాన్యం శ్రీ రాగాను బయటికి పంపి వెంటనే శ్రీ చైతన్య టెక్నో స్కూల్ కి అద్దెకు ఇవ్వగా
శ్రీ రాగా యాజమాన్యం ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం (TRSMA) తెలంగాణా రికాగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్) వారిని సంప్రదించి ఆ DEO, MEO లను కలిసి శ్రీ రాగా యాజమాన్యం ఎదుర్కుంటున్న సమస్యలపై ఫిర్యాదు చేశారు. ఒక స్కూల్ కి ఇంకో స్కూల్ కి మధ్యన కనీస దూరం ఉండాలని, అదే క్రమంలో 2 కిలోమీటర్ల దూరంలో వున్న అన్ని స్కూల్స్ నుండి NOC లు తప్పనిసరి అంటూ శ్రీ చైతన్య స్కూల్ వారిని వెనక్కి పంపినారు. కానీ తెర వెనుక ఎం మంత్రాంగం జరిగిందో కానీ ప్రస్తుతం అదే బిల్డింగ్ లోకి సారక్ట్ ఎడ్యూకేషనల్ సొసైటీ మేనేజ్మెంట్ వారు SRKT స్కూల్ బోర్డు తగిలించుకొని అడ్మిషన్స్ కోసం తిరుగుతున్నారు. ఇలా జరుతుంటే శ్రీ రాగా యాజమాన్యం వారు TRSMA వారిని మరియు పలు విద్యార్థి సంఘాల నాయకులను కలిసి జరుగుతున్నదంతా వివరిస్తూ విద్యాశాఖ నుండి పూర్తి అనుమతులు పొందకుండానే జోరుగా ప్రచారం చేస్తూ తమ స్టాఫ్ ను పేరెంట్స్ ను మభ్య పెడుతున్నారని తమకు తగిన న్యాయం చేయాలని వెంటనే విద్యా శాఖ వారు స్పందించి అనుమతులు లేకుండా తప్పుడు మార్గంలో ప్రచారం చేస్తున్న SRKT సొసైటీ సభ్యులను విచారించి SRKT స్కూల్ ను మూసివేయాలని కోరుతున్నామని శ్రీ రాగా యాజమాన్యం తెలిపారు.
శ్రీ రాగా స్కూల్ కరస్పాండెంట్ వర ప్రసాద్, మల్లారపు కవిత మాట్లాడుతూ…
విలువలతో కూడిన బోధన అందిస్తు, విద్యార్థుల భవిష్యత్ కోసం అహర్నిశలు శ్రమిస్తూ జిల్లా స్థాయి , రాష్ట్ర స్థాయి,జాతీయ స్థాయి లో ఎన్నో అవార్డులు, గోల్డు మెడల్స్ , మెరిట్ సర్టిఫికేట్స్ తో, గతంలో శ్రీ రాగా స్కూల్ లో చదివిన విద్యార్థులు ప్రస్తుతం ఉన్నతమైన ఉద్యోగాల్లో స్థిరపడి విలువలతో కూడిన జీవితాన్ని జీవిస్తూ ఇప్పుడు ఈ స్కూల్ కి చీఫ్ గెస్ట్ లు గా వస్తూ గౌరవం అందుకుంటున్నారు.
ఇటువంటి ఉన్నత భావాలతో ముందుకు దూసుకుపోతున్న మా శ్రీ రాగా కు అన్యాయం జరిగితే గతంలో చదువుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అందరం కలిసి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు…
విద్యాశాఖాధికారులు వెంటనే స్పందించి SRKT స్కూల్ కి అనుమతులు ఇవ్వకుండా శ్రీ రాగాకు న్యాయం జరిగేలా తగుచర్యలు తీసుకోవాలని కోరారు.