UPDATES  

NEWS

ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్‌ల శిక్షణలో పాల్గొన్న సర్పంచ్ తాటి అనిత ప్రాథమిక పాఠశాల రాజాపురంలో అభివృద్ధి పనులు సంఘమే శరణ్యం.. సంఘమే శాశ్వతం పాఠశాలల సమీపంలోని చిరుతిండి దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్ కాలువల శుభ్రతతో ప్రజారోగ్యం – సర్పంచ్ జర్పుల దేవి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి.మధుకర్ సుడిగాలి పర్యటన కవిత దీక్షకు మద్దతు తెలిపిన బిరుదురాజు వెంకటేశ్వర రాజు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని సత్కరించిన ఎమ్మెల్యే కూనంనేని కేజీబీవీ,యుఆర్ఎస్,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి:టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి డిఎస్.నాగేశ్వరరావు చంద్రు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

 వ్యాపార దిగ్గజం రతన్ టాటా మృతి

హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్)

ఆణువణువూ దేశభక్తి నింపుకున్న వ్యాపార దిగ్గజం రతన్ టాటా మరణ వార్త దేశ ప్రముఖులనే కాక సామాన్య ప్రజలను కూడా షాక్ కు గురి చేసింది. గత కొన్ని రోజులు ముంబయిలోని ఓ ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్థరాత్రి తుది శ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత ముంబయిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వ్యాపార సామ్రాజ్యంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రతన్‌ టాటా కేవలం వ్యాపారంలోనే కాకుండా దాతృత్వంలో కూడా తనకు ఎవరు సాటిలేరని నిరూపించుకున్నారు. 1937 డిసెంబర్ 28న నావల్ టాటా – సోనీ టాటా దంపతులకు రతన్ టాటా జన్మించారు. 1991 సంవత్సరంలో రతన్ టాటా టాటా గ్రూప్ చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. 10 వేల కోట్లుగా ఉన్న టాటా పారిశ్రామిక సామ్రాజ్యాన్ని లక్ష కోట్లకు తీసుకెళ్లడంలో ఆయన కృషి ఎంతో ఉంది. భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన పారిశ్రామికవేత్తలలో రతన్ టాటా ఒకరు. ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ అనేక ముఖ్యమైన విజయాలను సాధించింది. రతన్ టాటాకు 2000లో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్, దేశం రెండవ అత్యున్నత పౌర పురస్కారాలు లభించాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest