UPDATES  

NEWS

అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా రామ భక్త శ్రీ శ్రీ శ్రీ లాలు దాస్ అందరికి ఆదర్శం రక్తదానానికి యువత ముందుకు రావాలి: డీఎస్పీ ఆదినారాయణ ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ వరుణ్ కుమార్‌ కు మొక్కలు అందజేసిన వైభవంగా సర్వారం ఒడ్డుగూడెం తండాలో కోదండ రామాలయం విగ్రహ ప్రతిష్ట టీఎస్ యుటిఎఫ్ భద్రాచలం మండల కమిటీ నుంచి ఎంఈఓకు ప్రాతినిధ్యం కొత్తగూడెంలో నయా ల్యాబ్‌ దందా ? అసెంబ్లీ ముట్టడికి పిలుపు.. LHPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, న్యాయవాది రమేష్ నాయక్ బాణోత్‌ ముందస్తు అరెస్ట్

 గనుల సమీపంలో బెల్ట్ షాపులు బంద్ చేయించండి

ఏరియా ఎస్ఓ to జిఎం డి. శ్యాంసుందర్ కు వినతిపత్రం అందజేసిన సామాజిక సేవకుడు కర్నే బాబురావు

మణుగూరు (తెలంగాణ వాణి)

మణుగూరు గనుల సమీపంలోని బెల్ట్ షాపులు కార్మికులను రా -రమ్మని ఆకర్షిస్తు ప్రమాదాలకు కారణభూతం అవుతున్నాయని తక్షణమే బెల్ట్ షాపులు బంద్ చేయించాలని సామాజిక సేవకులు కర్నే బాబురావు డిమాండ్ చేశారు. ఏరియా ఎస్ఓ to జిఎం డి. శ్యాంసుందర్ కు వినతిపత్రం అందించినట్టు బాబురావు విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరు ఏరియా మైన్స్ కు దగ్గర్లో ఎలాంటి అనుమతులు లేకుండా అనేక బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారని ఇవి పని ప్రాంతమైన గనులకు దగ్గరలో ఉండటంతో పలురు కార్మికులు మద్యానికి బానిసలు అవడమే కాక, కొందరు ప్రమాదాలకు గురవ్వగా, కొందరు ప్రమాదాలకు కారణం అవుతున్నారన్నారు. ఇటీవల సంచలనం సృష్టించిన కూనవరంలో ఆటోను ఢీకొన్న ప్రమాదంలో పలువురు తీవ్ర గాయాలు కావటం, 2 రోజుల క్రితం కూనవరం గేటు వద్ద వోల్వో డ్రైవర్ ను కారు ఢీకొన్న సంఘటనలో సెక్యూరిటీ గార్డ్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేయటం లాంటి సంఘటనలు ఉదాహరణ అన్నారు. కొంతమంది మద్యం మత్తులో చేస్తున్న ఇలాంటి సంఘటనల వల్ల సింగరేణి ఉద్యోగులందరికీ చెడ్డ పేరు వస్తుందని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మద్యానికి బానిసలైన కార్మికులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ప్రమాదాలకు కారణం అవుతున్న మల్లారం గేటు వద్ద నుండి సింగరేణి మెయిన్ చెక్ పోస్ట్ వరకు అనధికారికంగా నడుస్తున్న బెల్ట్ షాపులను బంద్ పెట్టే విధంగా ఎక్సైజ్, పోలీస్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరినట్లు కర్నె బాబురావు తెలిపారు. స్థానిక అధికారులు స్పందించకపోతే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు బాబురావు తెలిపారు. ఎస్ఓ tu జిఎం కూడా సానుకూలంగా స్పందించారని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest