9
శస్త్ర చికిత్స వివరాలు వెల్లడించిన వెల్నెస్ ఆసుపత్రి వైద్యులు …...
నిజామాబాద్ ఆగస్టు 6 (తెలంగాణ వాణి ప్రతినిధి)
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్ వాడిలో ఉన్న వెల్నెస్ ఆసుపత్రిలో అరుదైన లేపరోటమి కోలస్టమి శస్త్ర చికిత్స ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆసుపత్రి వైద్యులు డాక్టర్ దేవేందర్ తెలిపారు. బుధవారం ఆసుపత్రి ఆవరణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ దేవేందర్ మాట్లాడుతూ.. మెట్పల్లి, ఇబ్రహీంపట్నం కు చెందిన గంగా ప్రవళిక జులై 25 వ తేదీ డెలివరీ అయిన తర్వాత పుట్టిన బాబుకు మల విసర్జన( మోషన్) రాకపోవడంతో మూడు రోజుల తర్వాత జులై 28వ తేదీన జిల్లా కేంద్రంలోని వెల్నెస్ హాస్పిటల్ కు తీసుకు వచ్చినట్టు తెలిపారు. బాబుకు అన్ని రకాల పరీక్షలు చేశాక ఇంతస్ట్రైనల్ అబ్స్ట్రక్షన్ చిన్న పేగులో దూరడంతో కడుపులో నొప్పితో పాటు యూరిన్, స్టోల్ సమస్య ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైద్యుల బృందం లాపరోటమీ అనే సాధారణ చికిత్స విధానం ద్వారా ఉదర అవయవాలను పరిశీలిస్తూ కొలోస్టమీ అనే నిర్దిష్ట రకమైన స్టోమా శస్త్ర చికిత్స ద్వారా మలం బయటకు వెళ్లడానికి పెద్దప్రేగులో ఓపెనింగ్ (స్టోమా)ను సృష్టించి విజయవంతంగా ఆపరేషన్ను పూర్తి చేసినట్టు తెలిపారు.
వెల్నెస్ ఆస్పత్రి వైస్ ప్రెసిడెంట్ బోదు అశోక్ ఆపరేషన్ హెడ్ హరికృష్ణ గౌడ్ లు మాట్లాడుతూ.. ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నతమైన వైద్యం అందించే లక్ష్యంగానే నిజామాబాదులో వెల్నెస్ హాస్పిటల్ ఏడవ బ్రాంచ్ ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. తమ హాస్పిటల్ వైద్యులు 24/7 అందుబాటులో ఉంటారని ఏ సమయంలో వచ్చిన ఎటువంటి సమస్యకైనా అవసరమైన అత్యవసర చికిత్స అందిస్తామని తెలిపారు. అతి తక్కువ ఖర్చుతోనే హైదరాబాద్ వెళ్లకుండా నిజామాబాదులోనే పూర్తిస్థాయి వైద్యం అందించేందుకు వెల్నెస్ ఆసుపత్రి సిద్ధంగా ఉందని జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాలని తెలిపారు. బాబు తల్లి గంగా ప్రవళిక మాట్లాడుతూ తన బాబుకు పుట్టినప్పటినుంచి మలవిసర్జన రాకపోవడంతో చికిత్స కోసం వెల్నెస్ ఆసుపత్రికి వచ్చామని తక్కువ ఖర్చుతో బాబుకు శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేశారని తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులకు వెల్నెస్ ఆసుపత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనస్తేషియా వైద్యురాలు శృతి శైని, శస్త్ర చికిత్స జరిగిన బాబు తల్లి గంగ ప్రవళిక, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.