ఆగస్టు 27న ఉద్యోగుల ‘మహాధర్నా’

పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని టీజీఈ -జేఏసీ డిమాండ్ కొత్తగూడెం ( తెలంగాణ వాణి) ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈ – జేఏసీ) ఆధ్వర్యంలో ఈ నెల 27న భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ధర్నా చౌక్‌లో మహాధర్నా నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్, ఎస్పీలకు మహాధర్నాకు సంబంధించిన నోటీసును అందజేశారు. రెండో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, […]