UPDATES  

రక్తం దానం చేసి మానవత్వం చాటుకున్న మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని ఉపాద్యాయుడు డి.కృష్ణ

రక్త దానం మరొకరికి ప్రాణ దానం.ఈ మేరకు బానోత్ కళ గర్భాశయ కణితి శస్త్రచికిత్స కోసం రక్తం అవసరం ఉండడంతో….మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని ఉపాద్యాయులు డి.కృష్ణ బి పాజిటివ్ రక్తం దానం చేసి మానవత్వం చాటుకున్నారు.దీనితో ఆయనను కుటుంబ సభ్యులు బంధువులు అభినందించారు.ఇదే సందర్భంలో పాఠశాల సిబ్బంది ఆయన దాతృత్వానికి అభినందనలు తెలిపారు.

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం అధ్యక్షుడు మాజీ ఉపసర్పంచ్ వోడ్నాల శంకరయ్య ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలు మండల కేంద్రంలోని శ్రీ శివ భక్త మార్కండేయ దేవాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సమాజ సేవ ,విద్య వ్యాప్తి, సాంఘిక సంస్కరణలో చేసిన కృషిని […]

గ్రామాల్లో ఎన్నికల సందడి

నోటిఫికేషన్ కు ముందే బుజ్జగింపులు, దావత్ లు షురూ హైదరాబాద్ (తెలంగాణ వాణి) కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటిసారి నిర్వహించే స్థానిక ఎన్నికల సందడి షురూవైంది. ఎన్నికల కోడ్ రాకముందే గ్రామాల్లో బరిలో ఉండే అభ్యర్థి పేరు ఖరారు కాక ముందే ఆశావహులు రాజకీయ వేడిని రాజేస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకులు, తాజా మాజీ నాయకులు చోటామోటా నాయకులు ఓటర్లను సంప్రదించి ఎన్నడూ లేని మర్యాదలు ప్రేమానురాగాలు వలకబోస్తూ రిజర్వేషన్ తనకు అనుకూలిస్తే తప్పకుండా […]

సిరిసిల్ల కలెక్టర్ బదిలీ – దేవుడికి మొక్కులు చెల్లించిన పట్టణ ప్రజలు రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 27 (తెలంగాణ వాణి) సిరిసిల్ల కలెక్టర్ బదిలీతో పట్టణ ప్రజలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. సిరిసిల్లలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో వారు ప్రత్యేక పూజలు చేసి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు, తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో వీడియోలు […]

హుస్నాబాద్‌లో జీవో 317 బాధితుల ముందస్తు అరెస్టులు

పండుగ పూట ఉపాధ్యాయుల ఇబ్బందులు ​సిద్దిపేట/హుస్నాబాద్: (తెలంగాణ వాణి స్టేట్ కోఆర్డినేటర్) సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పరిధిలో నివసిస్తున్న జీవో 317 ప్రభుత్వ ఉపాధ్యాలను హుస్నాబాద్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు. జీవో 317 ద్వారా బదిలీకాని ఉద్యోగులందరినీ స్థానికత ఆధారంగా బదిలీ చేయాలనే డిమాండ్‌తో వారు శనివారం హైదరాబాద్ సెక్రటేరియట్ ముందు ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే జీవో 317 ద్వారా ‘డిస్లొకేట్’ అయి బాధితులు అయిన ఉపాధ్యాయులను అరెస్టు చేయడం […]