UPDATES  

NEWS

ఉచిత మట్టి గణపతులు పంపిణీ చేసిన ప్రముఖ వ్యాపార వేత్త

బిచ్కుంద/కామారెడ్డి (తెలంగాణ వాణి ప్రతినిధి) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ప్రముఖ వ్యాపార వేత్త బండయప్ప పటేల్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతులను బిచ్కుంద మఠాధిపతి శ్రీ శ్రీశ్రీ 108 సోమలింగా శివాచార్య స్వామిజీ వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. మఠాధిపతి స్వామిజీ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరిపై ఉందని మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి పంపిణీ చేసినందుకు సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో బండయప్ప పటేల్, సిద్దు […]

పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి కోటి పారితోషకం, గ్రూప్-2 ఉద్యోగం

హైదరాబాద్ (తెలంగాణ వాణి కరస్పాండెంట్) పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ లో అద్భుతం చేసిన తెలంగాణ అథ్లెట్ దీప్తి జీవాంజిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. అథ్లెట్ దీప్తి జీవాంజి పారాలింపిక్స్ లో పాల్గొని కాంస్య పతకం సాధించి సత్తా చాటింది. ఇటీవల ఒలింపిక్స్ తరువాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విశ్వవేదికపై సత్తాచాటే అథ్లెట్లు, ఆటగాళ్లను కచ్చితంగా గౌరవిస్తాం, వారు మరిన్ని విజయాలు సాధించేందుకు ప్రోత్సహిస్తామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం రేవంత్ తెలంగాణ […]

మట్టి వినాయకుడిని పూజిద్దాం

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదామని లయన్స్ క్లబ్ ధర్మారం అధ్యక్షుడు తలమక్కి రవీందర్ శెట్టి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ధర్మారం మండల కేంద్రంలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు ఎల్లారెడ్డి, ఎండి ముజాహిద్, కళ్లెం స్వామి రెడ్డి, ఎలగందుల అశోక్, సిహెచ్ నర్సింగం, సిహెచ్ శేఖర్, దయానంద్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.

150 గణేష్ విగ్రహాల పంపిణీ చేసిన డాక్టర్ మల్లెబోయిన అంజి యాదవ్

కోదాడ (తెలంగాణ వాణి ప్రతినిది) నియోజకవర్గ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు కులమతాలకు అతీతంగా ప్రశాంతమైన వాతావరణంలో యువత ఉత్సవాలు జరుపుకోవాలని తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, బిజెపి రాష్ట్ర నాయకులు మల్లెబోయిన అంజి యాదవ్ అన్నారు. యువత దైవభక్తి మార్గంలో నడవాలని నియోజకవర్గ వ్యాప్తంగా 150 వినాయక విగ్రహాలను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో శేఖర్ నాయుడు, వెంకన్న, శ్రీకాంత్, వెంకటేష్ బాబు, వంగవీటిశ్రీను, నాగేంద్ర చారి, పవన్, ఠాకూర్ నాయక్, జనార్దన్ రావు, […]

దిగజారుడు రాజకీయాలకు కౌశిక్ రెడ్డి స్వస్తి పలకాలి

జయశంకర్ భూపాలపల్లి (తెలంగాణ వాణి ప్రతినిధి) దిగజారుడు రాజకీయాలకు ఆధ్యుడు హుజురాబాద్ శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి అని, అలాంటి దిగజారుడు రాజకీయాలకు కౌశిక్ రెడ్డి స్వస్తి పలకాలని, లేకుంటే ప్రజలే తగిన గుణపాఠం నేర్పుతారని కాంగ్రెస్ పార్టీ మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు ఆకుతోట కుమారస్వామి హెచ్చరించారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాంపరింగ్ చేస్తుందంటూ తప్పుడు కూతలు కోస్తున్న కౌశిక్ […]

తెలంగాణ వాణి కథనానికి స్పందన

మల్హర్రావు (తెలంగాణ వాణి) మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో కొన్ని నెలలుగా వీధి దీపాలు వెలగడం లేదని తెలంగాణ వాణి దినపత్రికలో ప్రచురించిన కథనానికి స్పందించిన గ్రామపంచాయతీ కార్యదర్శి సాయిచరణ్ గ్రామంలో వీధి దీపాలను ఏర్పాటు చేయడం జరిగింది.

ప్రొఫెషనల్ హస్తకళాకారులు రాజస్థానీలు

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) వినాయక చవితి అంటేనే మనకు గుర్తుకు వచ్చేది రకరకాల ఆకృతిలొ కనిపించే గణనాథుల విగ్రహాలు… వాటిని తయారు చేయడంలో రాజస్థానీలకు ప్రత్యేకత ఉంది. కుటుంబ సభ్యులు, పిల్లలు సైతం విగ్రహాల తయారీలో నిమగ్నమైపోతారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో గత మూడేళ్లుగా రాజస్థానీలు ఇక్కడ గణపతి విగ్రహాలను తయారు చేస్తున్నారు. వివిధ రకాల గణనాథుల విగ్రహలను ఆకర్షణీయంగా తయారు చేస్తు ఉపాధి పొందుతున్నారు. ధర్మారం చుట్టుపక్కల మండలాలకు చెందిన వందలాది […]