సికింద్రాబాద్ (తెలంగాణ వాణి) హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో తార్నాక డివిజన్ లాలపేటకి చెందిన దర్శనం సాయిప్రణవ్ మొదటి స్థానంలో నిలిచి రెండు గోల్డ్ మెడల్స్ సాధించాడు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రోలర్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయస్సు మధ్య వారికి 500, 1000 మీటర్ల రేసింగ్ పోటీలను మొయినాబాద్ లో నిర్వహించారు. ఈ రెండు పోటీలలో సాయి ప్రణవ్ మొదటి స్థానంలో నిలిచి రెండు బంగారు పతకాలు సాధించారు. సాయి ప్రణవ్ తర్నాకలోని నారాయణ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. సాయి ప్రణవ్ గతంలో జాతీయ స్థాయి పోటీలలో కూడా పాల్గొన్నారు. ఈ మేరకు ఆయనకు ఆయన కుటుంబ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్దులు శుభాకాంక్షలు తెలిపారు.
Post Views: 29