మెట్ పల్లి (తెలంగాణ వాణి)
జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన కాటిపెల్లి శ్రీకర్ రెడ్డి, గత నెల 27న ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఎస్సార్ ఎస్పీ కాలువలో పడి గల్లంతైన విషయం తెలిసిందే. అందులో ఇద్దరు బయటపడగా, శ్రీకర్ రెడ్డి కెనాల్లో కొట్టుకుపోయాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు శ్రీకర్ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా సోమవారం తాటిపెల్లి గ్రామ శివారులోని ఎస్సారెస్పి కాలువలో శ్రీకర్ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం ఆనవాళ్లను పరిశీలించిన తర్వాత, మెట్‌పల్లి మాజీ జడ్పిటిసి కాటిపెల్లి రాధా శ్రీనివాస్ రెడ్డిల కుమారుడని తేలింది. మెట్‌పల్లి మాజీ జడ్పీటిసి కాటిపెల్లి రాధా, శ్రీనివాస్ రెడ్డి కుటుంబంలో రోదనలు మిన్నంటాయి.
Post Views: 815