UPDATES  

NEWS

వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో ప్రతిరోజు మొక్కలు నాటుతున్న చిరంజీవి మూడు విశ్వామిత్ర చౌహాన్ యధార్థ జీవితాల వాస్తవిక చిత్రణ – కుండి మాజీ ఉపప్రధాని డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌ కు ఘన నివాళులు:డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మధుకర్ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన మాజీ మంత్రి,బిఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జ్ వనమా వెంకటేశ్వరరావు. పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు గడువు తేదీ ఏప్రిల్ 19 మాజీ ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళులు ఉపాద్యాయుల సమస్యల పై నిత్యం పరిష్కారం చేసే దిశగా TSTTF.స్పాట్ వాల్యూషన్ డ్యూటీ సమస్యలు పరిష్కరించిన టిఎస్టిపిఎఫ్ సిపిఎం కొత్తగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు ఏప్రిల్ 7వ తేదీన జిల్లా స్థాయి సైన్స్ అండ్ గణితం క్విజ్ పోటీలు మీడియా అండ్‌ కమ్యూనికేషన్స్‌ అడ్వైజర్‌గా అల్లం నారాయణ ?

 సిపిఎం కొత్తగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలు

స్థానిక మంచికంటి భవన్ లో గురువారం నాడు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి సిపిఎం కొత్తగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా కొమరయ్య చిత్రపటానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజె రమేష్ పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏజె రమేష్ మాట్లాడుతూ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించి నైజాములకు వ్యతిరేకంగా ఉద్యమించిన మహోన్నత వ్యక్తి,తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వారసత్వాన్ని పనికి పుచ్చుకొని భూమి లేని పేదలు ఈ భూమిపై ఉండకూడదు అనేటువంటి లక్ష్యంతో ఆనాటి అమరవీరుల ఆశించిన లక్ష్యానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు ఉద్యమించి పేదలు లేని రాజ్యాన్ని తీసుకురావాలని ఏజె రమేష్ అన్నారు.నాలుగు వేలమంది అమరులు అశువులు బాసిన చరిత్ర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అని బానిస వ్యవస్థను రద్దు చేయాలని, దున్నేవాడికే భూమి ఇవ్వాలని, కూడు,గుడ్డ,నివాసం కల్పించాలని జరిగిన మహత్తర పోరాటం నేటి తరానికి వివరించాలన్నారు. బంచెన్ అన్న బక్కోడితో బంధుకులు పట్టించి నైజాం రాజులకు వ్యతిరేకంగా గుండెను నిలిపిన అనేకమంది అమరవీరుల రక్త తర్పణమతో నిండి ఉన్న తెలంగాణ భూమిలో పేదల రాజ్యం కోసం ఎర్రజెండా స్థాపన కోసం ప్రతిన బునాలని ఆయన అన్నారు.నేటి కాంగ్రెస్ పరిపాలనలో పేద వర్గాలకు సంక్షేమ పథకాల అమలు విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.ఆరు గ్యారంటీల అమలు కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి సర్వే నిర్వహించి ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.వీర తెలంగాణ వీరుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్ పట్టణ కార్యదర్శు వర్గ సభ్యులు నందిపాటి రమేష్ , జునుమాలా నాగేష్,ఆప్టికట్ల జయశ్రీ, ఆవుల శ్రీరాములు, ఆలేటి శ్రీనివాసాచారి, అన్నవరపు ఇందిరా,నాగకృష్ణం, గడల నరసింహారావు,జయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest