UPDATES  

NEWS

వివేకానంద పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర బంద్ ని విజయవంతం చేద్దాం కటికనపల్లి ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా సాయిలు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థిని పరామర్శించిన టిజిపిఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు దార మధు టేకులపల్లి టీఎస్‌యుటిఎఫ్‌ మండల ప్రధాన కార్యదర్శి డి.హరి నాయనమ్మ దశదిన కార్యక్రమానికి హాజరై శ్రద్ధాంజలి ఘటించిన టిఎస్ యుటిఎఫ్ నాయకులు  పెద్దిరెడ్డి రియాన్ చక్రవర్తి ని ఆశీర్వదించిన రాకేష్ దత్త విషాదం నింపిన పోలియో చుక్కలు పెద్దచింతకుంట గ్రామంలో ఇంటింటికి సీఐటీయూ బైండ్ల కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా బైండ్ల ప్రతాప్ తడ్కల్ లో పల్స్ పోలియో కార్యాలయం

 వేములవాడ పట్టణంలో సెక్షన్ 144 అమలు

వేములవాడ పట్టణంలో సెక్షన్ 144 అమలు…

 

  • ఆలయ ప్రధాన రహదారి రోడ్డు వెడల్పులో భాగంగా ప్రారంభమైన కూల్చివేతలు…

 

వేములవాడ,జూన్ 15 (తెలంగాణ వాణి ఆర్ సి ఇంచార్జ్) :

ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ పట్టణంలో ప్రధాన రహదారి రోడ్డు వెడల్పు దృష్ట్యా భద్రతా చర్యలలో భాగంగా జిల్లా అధికారులు,పోలీస్ శాఖ కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. బ్రిడ్జి నుండి వేములవాడ రాజన్న ఆలయం వరకు కూల్చివేతల కార్యక్రమాన్ని శాంతియుతంగా, అడ్డంకులు లేకుండా చేపట్టేందుకు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163(3) (సెక్షన్ 144 సీఆర్పీసీ) అమలులోకి తీసుకువచ్చారు.ఈ మేరకు జూన్ 16, 2025 సోమవారం ఉదయం 6 గంటల నుంచి కూల్చివేతల పనులు పూర్తయ్యే వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. కూల్చివేతల ప్రాంతమైన ఆలయ ప్రాంగణం నుండి 100 మీటర్ల పరిధిలో ప్రజలు గుమిగూడటం పూర్తిగా నిషేధించబడినట్లు పేర్కొన్నారు.అధికారుల సూచన మేరకు ప్రజలు సహకరించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని కోరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest