UPDATES  

NEWS

భద్రాచలం డివిజన్ లో పి ఆర్ టి యు టి ఎస్ సమావేశం మండల స్థాయి బాల మేళా 2.0 విజయవంతం : ఎంఇఓ కృష్ణయ్య కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి – సాయి కుమార్ దంపతుల చేతుల మీదుగా నూతన పట్టు వస్త్రాలు బహుకరణ హోలీ పండుగను ఘనంగా జరుపుకున్న లక్ష్మీదేవిపల్లి పంచాయతీ సిబ్బంది కేజీబీవీ,యుఆర్‌ఎస్,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలపై మూడు దశల పోరాటం:టీఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు. రంగులమయమైన ఇండోర్ స్టేడియం: తైక్వాండో విద్యార్థుల హోలీ హంగామా ! నూతన జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టిఎస్ యు.టి.ఎఫ్ భద్రాది జిల్లా కమిటి  సేవాలాల్ సద్గురు చూపిన మార్గం ఆదర్శనీయం: వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ పిడి బుగ్గ వెంకటేశ్వర్లు పదవీ విరమణ సందర్భంగా సన్మానించిన పి ఆర్ టి యు టి ఎస్ భద్రాద్రి జిల్లా కమిటీ హర్ష టౌన్షిప్‌లో టీఎస్ టిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ రాములు నాయక్ ఆధ్వర్యంలో మేయర్, కార్పొరేటర్‌ లకు ఘన సన్మానం

 తెలంగాణ వాణి పాత్రికేయుల ఆత్మీయ సమ్మేళనం


– హాజరైన ఎడిటర్,స్టేట్ కో ఆర్డినేటర్,-స్టేట్  న్యూస్ కో ఆర్డినేటర్ బ్యూరోలు

కరీంనగర్ బ్యూరో మే 10 (తెలంగాణ వాణి)

జగిత్యాల జిల్లా ఎల్ ఎల్ జి గార్డెన్ లో శనివారం ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల తెలంగాణ వాణి పాత్రికేయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కె. వి. మోహన్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ వాణి పత్రిక ఎడిటర్ జేరిపోతుల సంవత్, స్టేట్ కో-ఆర్డినేటర్ మామునూరి సంవత్, స్టేట్ న్యూస్ కో ఆర్డినేటర్ అఫ్జల్ పఠాన్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో పి.రవికిరణ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా బ్యూరో కే. మహేష్ హాజరయ్యారు. తెలంగాణ వాణి పత్రిక జర్నలిస్టులు ఆర్సీలు మండల విలేకరులు పలు అంశాలను పత్రిక ఎడిటర్, స్టేట్ కో ఆర్డినేటర్, స్టేట్ వ్యూస్ కో ఆర్డినేటర్ దృష్టికి జర్నలిస్టులకు ఉన్న సమస్యలను విన్నవించుకున్నారు. ఎడిటర్, స్టేట్ కో ఆర్డినేటర్, స్టేట్ న్యూస్ కో ఆర్డినేటర్ మాట్లాడుతు పత్రికలో జరుగుతున్న పలు అంశాలను చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సమస్యలను అనుసరించి ముందు పోవాలని సూచించారు.. ఎప్పటికప్పుడు పాత్రికేయులు ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. తెలంగాణ వాణి పత్రికలో సమస్యలపై కథనాలు రాస్తే అధికారులు, ప్రభుత్వం స్పందించి సమస్యలు తీరుస్తుందని వెల్లడించారు. ప్రజా సమస్యలపై తెలంగాణ వాణి పత్రిక ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ వాణి పాత్రికేయులకు సమస్యలు ఉంటే వెంటనే స్పందించి వెన్నుదండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ వై.రవి, సీనియర్ పాత్రికేయులు నాయిని శ్రీనివాస్, కోరుట్ల, మెట్ పల్లి, వేములవాడ, బోధన హుస్నాబాద్ ఆర్ సి లతో పాటు పలువురు జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.

 

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest