UPDATES  

 జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండవలెను, అనవసరంగా ఎవరు బయటకు రావద్దు..

రానున్న 48 గంటల వరకు భారీ వర్షాలు

పోలీస్ కమిషనర్ వెల్లడి

నిజామాబాద్ ఆగస్టు 28: (తెలంగాణ వాణి ప్రతినిధి)

రాబోయే 2-3 రోజుల వర్ష సూచన దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప ప్రజలు ఎవరు బయటకి రావద్దని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య వెల్లడించారు.

ప్రజల భద్రతా దృష్ట్యా 24 X 7 పోలీస్ అధికారులు , సిబ్బంది అప్రమత్తంగా ఉండాలనీ,నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండవలెను ఎవరు కూడా అనవసరంగా బయటకు వెళ్ళరాదన్నారు.

 ఎక్కడనైనా విద్యుత్తు తీగలు కింద పడ్డ లేదా వేలాడుతున్న లేదా వర్షపు నీటికి తగిలిన వాటిని ఎవ్వరు కూడా తాకరాదు వాటిని తాకినట్లయితే విద్యుత్ ప్రవాహం కలిగి ప్రమాదం సంభవించును గణేష్ మండలి నిర్వాహకులు మండపం వద్ద తగు జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలి ప్రధానంగా విద్యుత్ తీగల వద్దకు ఎవరు వెళ్ళవద్దు.

 ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ సూచించారు. పొంగిపొర్లనున్న వాగులు, వంకలు వద్దకు వెళ్లవద్దు.

 జలాశయాలు, చెరువులు, కుంటలు చూడడానికి వెళ్లకూడదు – ప్రమాదానికి గురయ్యే అవకాశముంది. కావున అట్టి ప్రదేశాలకు ప్రజలు ఎవరు కూడా వెళ్లకూడదు.వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లే రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పొలాల్లో పడిపోయిన విద్యుత్తు తీగలతో ప్రమాదం కలిగే అవకాశం ఉన్నందున రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

 పురాతన కట్టడాలు లేదా పురాతనమైన ఇండ్లు పురాతనమైన గోడలు ఉన్నట్లయితే వర్షతాకిడికి నాని కింద పడే అవకాశాలు ఉన్నాయి కావున ప్రజలు అప్రమత్తంగా ఉండవలెను.

 ఎక్కడైనా వరద ఉదృతి తలెత్తిన సందర్భంలో పోలీసు సిబ్బంది, అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టి ప్రాణ నష్టం లేకుండా చూడాలని అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.వినాయక విగ్రహం ప్రతిష్టించిన చోటా మండపము నిర్వాహకులు తప్పనిసరిగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరు కూడా కరెంటు తీగల వద్దకు వెళ్ళకుండ అప్రమత్తంగా ఉండాలి. రెవెన్యూ , మునిసిపల్ , వ్యవసాయం , గ్రామీణాభివృద్ధి , పశుసంవర్ధక , ప్రజా రవాణా, నీటిపారుదల వంటి అన్ని విభాగాలతో సరైన సమన్వయం చేసుకోవాలి అని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.అత్యవసర సమయంలో డయల్ 100 ( లేదా )పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్:8712659700( లేదా ) సంబంధిత పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ కు సంప్రదించాలని సూచించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest