UPDATES  

 విన్నూత్న బహుకరణతో ఆకట్టుకున్న ఈఈ మధుకర్ – రాజ్యాంగ గ్రంథం అందజేతపై చైర్మన్ ప్రశంసలు

భద్రాచలం పర్యటనలో ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను బి పి ఎల్ గెస్ట్ హౌస్‌లో గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తాండ్ర మధుకర్ మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు.ఈ సందర్భంగా గిరిజన ఇంజనీరింగ్ శాఖలో పోస్టులు పెంచి, అన్ని స్థాయిల్లో రెగ్యులర్ పదోన్నతులను అమలు చేయాలని ఉన్నతాధికారులకు సిఫారసు చేయాలని ఆయన విన్నవించారు.అనంతరం భారత రాజ్యాంగ గ్రంథాన్ని చైర్మన్‌కు బహుకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ..తన పర్యటనలో ఇలాంటి విన్నూత్న బహుకరణ ఎవరూ చేయలేదని, రాజ్యాంగ గ్రంథాన్ని అందించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇలాంటి బహుకరణలు ప్రేరణాత్మకంగా ఉంటాయని ఆయన మధుకర్‌ను అభినందించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest