UPDATES  

NEWS

ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్‌ల శిక్షణలో పాల్గొన్న సర్పంచ్ తాటి అనిత ప్రాథమిక పాఠశాల రాజాపురంలో అభివృద్ధి పనులు సంఘమే శరణ్యం.. సంఘమే శాశ్వతం పాఠశాలల సమీపంలోని చిరుతిండి దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్ కాలువల శుభ్రతతో ప్రజారోగ్యం – సర్పంచ్ జర్పుల దేవి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి.మధుకర్ సుడిగాలి పర్యటన కవిత దీక్షకు మద్దతు తెలిపిన బిరుదురాజు వెంకటేశ్వర రాజు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని సత్కరించిన ఎమ్మెల్యే కూనంనేని కేజీబీవీ,యుఆర్ఎస్,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి:టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి డిఎస్.నాగేశ్వరరావు చంద్రు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

 మాజీ ఉపప్రధాని డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌ కు ఘన నివాళులు:డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మధుకర్

పాల్వంచ:ఉన్నత అధికార ఆదేశాల మేరకు గిరిజన సంక్షేమ శాఖ పాల్వంచ ఇంజనీరింగ్ సబ్ డివిజన్ నందు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు జయంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ మధుకర్ మరియు సహాయం ఇంజనీర్లు సీనియర్ అసిస్టెంట్ పాల్గొని చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ మధుకర్ మాట్లాడుతూ.. ఆయన మాట్లాడుతూ..30 సంవత్సరాల పాటు ఆయన దేశానికి అందించిన సేవలు మరువ లేనివన్నారు.గొప్ప రాజకీయ వేత్తగా సామాజిక సమానత్వం కోసం జీవిత కాలం పోరాడారని కొనియాడారు.అనేక పదవులను చేపట్టి తనదైన ముద్రను వేశారని,ఆయన జీవిత పర్యంతం భారతదేశ అభివృద్ధి కోసం అభ్యున్నతికై కృషి చేశారని తెలిపారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని గిరిజన ఇంజనీరింగ్ శాఖ బలోపేతం చేయడానికి మరియు అభివృద్ధి కోసం ప్రణాళిక రూపొందించి ప్రతి గిరిజన గ్రామానికి ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు పాటు పడాలని సహా ఇంజనీర్లు మరియు సిబ్బంది ఉద్దేశించి డిప్యూటీ ఇంజనీర్ టి.మధుకర్ అన్నారు.ఈ కార్యక్రమంలో సహాయక ఇంజనీర్లు శ్రీకాంత్, యస్వంత్ యోగేష్ మరియు సీనియర్ అసిస్టెంట్ సాధు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest