UPDATES  

 మల్లవరంలో వనమహోత్సవం కార్యక్రమం.

తల్లాడ, ఆగష్టు 25 (తెలంగాణ వాణి) : వనమహోత్సవంలో భాగంగా మండల పరిధిలో మల్లవరం గ్రామపంచాయతీలో సర్పంచ్ కటి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో మల్లవరం టు గంగాదేవిపాడు రోడ్డులో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ భవిష్యత్తులో పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని మొక్కలు నాటడం చాలా అవసరమని గుర్తు చేశారు. అదేవిధంగా గ్రామంలోని ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాలలో పొలాలలో విరివిగా మొక్కలు నాటాలని అందుకు అవసరమైన మొక్కలు గ్రామపంచాయతీ నర్సరీలో సిద్ధంగా ఉన్నాయని వాటిని తీసుకెళ్లి నాటాలని కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తల్లాడ ఎంపీడీవో శ్రీధర్ రాజు, మండల వైద్యాధికారి ఏపీవో కోటయ్య, గ్రామ ఉపసర్పంచ్ ధారావత్ యశోద, మాజీ ఉపసర్పంచ్ ఎర్రి నరసింహారావు, తోట మురళి, బెల్లంకొండ అంజయ్య, వార్డు సభ్యులు పసుపులేటి కోటేశ్వరరావు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు భూక్య అంజయ్య, గ్రామపంచాయతీ సెక్రటరీ సిద్ధిక్ మియా, ఫీల్డ్ అసిస్టెంట్ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Date of Publish : 26 August 2026, 8:25 am Posted by : TELANGANA VANI

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest