ధర్మారం, (తెలంగాణ వాణి ప్రతినిధి )
ఉప సర్పంచ్ ల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ పోస్టర్ ను ఆదివారం ధర్మపురిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు ముత్యాల స్వామి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంగ తిరుపతి, ధర్మారం మండల అధ్యక్షులు బోనగిరి అజయ్ కుమార్, గౌరవ అధ్యక్షులు అరిగే రవి, ప్రచార కార్యదర్శులు బెజ్జెంకి యమునా రాజేందర్,మోటపలుకులసత్యనారాయణ, క్యాషియర్ కోల తిరుపతి, వివిధ గ్రామాల ఉప సర్పంచ్ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉప సర్పంచ్ లు గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. డిసెంబర్ 27న జరగనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.



