UPDATES  

NEWS

ప్రతి డ్రైవర్ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి – పట్టణ ఎస్సై శ్రీనివాస్,ట్రాఫిక్ ఆర్ఎస్సై రాజు నవంబర్ 11న నిర్మల్‌లో బీఆర్ఎస్ రైతు గర్జన సభ అదృశ్యం కేసు దర్యాప్తులో సంచలనం.. భర్తే హంతకుడు! మూడు జిల్లాల 108 సిబ్బందికి ఐదు రోజుల ప్రత్యేక శిక్షణ రాజారాంపల్లిలో విషాదం.. విద్యుత్‌ షాక్‌తో చిన్నారి దుర్మరణం గ్రామ సమస్యలపై సర్వసభ సమావేశంలో గళమెత్తిన సర్పంచులు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విద్యానగర్‌లో డ్రైనేజీల శుభ్రత పనులు బియ్యం దొంగ ఆళ్ళ మురళి ని వెంటనే అరెస్ట్ చెయ్యాలి : యెర్రా కామేష్ అనుమతులు లేకుండానే జేసీబీతో తవ్వకాలు..ట్రాక్టర్లలో మట్టి తరలింపు గోల్డ్ మెడల్ సాధించిన బొడ్డు వినయ్

 ప్రతి డ్రైవర్ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి – పట్టణ ఎస్సై శ్రీనివాస్,ట్రాఫిక్ ఆర్ఎస్సై రాజు

వేములవాడ, నవంబర్ 07 (తెలంగాణ వాణి ప్రతినిధి):వేములవాడ పట్టణంలో ఇసుక ట్రాక్టర్ల రాకపోకలు, నిబంధనల అమలుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇసుక రీచ్‌లకు సంబంధించిన అనుమతులు, ట్రాక్టర్ల రికార్డులు, డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్‌లను పట్టణ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.పట్టణ ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఆర్ఎస్ఐ రాజుతో కలిసి ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ల డ్రైవర్ల వద్ద సరైన డ్రైవింగ్ లైసెన్స్‌లు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. లైసెన్స్‌లు లేని డ్రైవర్లు వెంటనే వాటిని పొందాలని ఎస్సై సూచించారు.అలాగే ట్రాక్టర్లను నిబంధనలకు విరుద్ధంగా రాంగ్ రూట్లలో నడపకూడదని, ప్రతి ఒక్క డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని డ్రైవర్లు, ట్రాక్టర్ల యజమానులను హెచ్చరించారు.నిబంధనల అమలుకు సంబంధించి ట్రాక్టర్ల యజమానులకు కొంత సమయం ఇచ్చినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఇందుకు యజమానులు సానుకూలంగా స్పందించారని, త్వరలోనే అన్ని నిబంధనలు పాటిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.పట్టణంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణే లక్ష్యంగా తనిఖీలు కొనసాగుతాయని ట్రాఫిక్ అర్ఎస్సై స్పష్టం చేశారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 7 November 2026, 3:31 pm Posted by : TELANGANA VANI

ప్రతి డ్రైవర్ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి – పట్టణ ఎస్సై శ్రీనివాస్,ట్రాఫిక్ ఆర్ఎస్సై రాజు

వేములవాడ, నవంబర్ 07 (తెలంగాణ వాణి ప్రతినిధి):వేములవాడ పట్టణంలో ఇసుక ట్రాక్టర్ల రాకపోకలు, నిబంధనల అమలుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇసుక రీచ్‌లకు సంబంధించిన అనుమతులు, ట్రాక్టర్ల రికార్డులు, డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్‌లను పట్టణ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.పట్టణ ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఆర్ఎస్ఐ రాజుతో కలిసి ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ల డ్రైవర్ల వద్ద సరైన డ్రైవింగ్ లైసెన్స్‌లు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. లైసెన్స్‌లు లేని డ్రైవర్లు వెంటనే వాటిని పొందాలని ఎస్సై సూచించారు.అలాగే ట్రాక్టర్లను నిబంధనలకు విరుద్ధంగా రాంగ్ రూట్లలో నడపకూడదని, ప్రతి ఒక్క డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని డ్రైవర్లు, ట్రాక్టర్ల యజమానులను హెచ్చరించారు.నిబంధనల అమలుకు సంబంధించి ట్రాక్టర్ల యజమానులకు కొంత సమయం ఇచ్చినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఇందుకు యజమానులు సానుకూలంగా స్పందించారని, త్వరలోనే అన్ని నిబంధనలు పాటిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.పట్టణంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణే లక్ష్యంగా తనిఖీలు కొనసాగుతాయని ట్రాఫిక్ అర్ఎస్సై స్పష్టం చేశారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest