వేములవాడ 12 సెప్టెంబర్ (తెలంగాణ వాణి): పేదలకు అండగా నిలుస్తూ సాయి రూప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు ఇప్పపూల అజయ్ తండ్రి ఇప్పపూల లక్ష్మీరాజం జ్ఞాపకార్థం శనివారం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో పేదలకు గొడుగులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు ఇప్పపూల మమత–అజయ్ మాట్లాడుతూ.. సాయి రూప చారిటబుల్ ట్రస్ట్ పేదలకు భరోసాగా నిలుస్తూ, సమాజ సేవలో భాగంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. పేదలు, విద్యార్థులు, మహిళలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి తమ వంతు సహాయం అందిస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. తమ తండ్రి ఇప్పపూల లక్ష్మీరాజం జ్ఞాపకార్థం గొడుగుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని పేర్కొన్నారు.ట్రస్ట్ నిర్వాహకులు పిల్లి బాబురావు, వ్యవస్థాపక అధ్యక్షులు ఎద్దండి రాజు–సరళ మాట్లాడుతూ.. ట్రస్ట్ స్థాపించిన రెండేళ్ల కాలంలో పేదలకు అన్నదానం, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, దుప్పట్ల పంపిణీ, మహిళలకు చీరల పంపిణీ, పేద రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్ల పంపిణీతో పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.సమాజ హితం కోసం తమ వంతు బాధ్యతగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని వారు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు పిల్లి బాబురావు, వ్యవస్థాపక అధ్యక్షులు ఎద్దండి రాజు–సరళ, కోశాధికారి దూలం భూమేష్ గౌడ్, గొంటి నవీన్, వాసాల హరిప్రసాద్‌తో పాటు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.





