UPDATES  

NEWS

భైంసాలో ఘనంగా దీక్షా దివస్ వేడుకలు మంత్రి చేతుల మీదుగా ఉప సర్పంచ్ ల ఫోరం భారీ బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ పేదరికాన్ని జయించి నేవీలో కొలువు… మేడారం బిడ్డ సన్నీకి ఘన సన్మానం దుర్గామాత ఆలయంలో చోరీ – వెండి హారాలు, బంగారు ముక్కుపుడక ఎత్తుకెళ్లిన దొంగలు దుర్గామాత ఆలయంలో చోరీ – వెండి హారాలు, బంగారు ముక్కుపుడక ఎత్తుకెళ్లిన దొంగలు ఉద్యోగులు, పెన్షనర్లు ఆరోగ్య పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఫ్లెక్సీ ఫైటింగ్‌..అల్గునూర్‌లో అగ్గి డిసెంబర్ 1న నిర్మల్‌లో TUWJ-IJU జిల్లా 3వ మహాసభలు రేణికుంట బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం అంబేద్కర్ విగ్రహానికి మరమ్మతులు.. కొత్త రంగులు వేయించేందుకు చర్యలు

 పేదరికాన్ని జయించి నేవీలో కొలువు… మేడారం బిడ్డ సన్నీకి ఘన సన్మానం

 ధర్మారం, (తెలంగాణ వాణి ప్రతినిధి )

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం గ్రామానికి చెందిన పేద కుటుంబానికి చెందిన యువకుడు ఎల్తూరి సన్నీ భారత నావీ (నేవీ) లో ఉద్యోగం సాధించిన సందర్భంగా గ్రామస్తులు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

పేదరికం, ఎన్నో ఇబ్బందుల మధ్య కూడా సన్నీ చదువుపై దృష్టి పెట్టి, పట్టుదలతో కష్టపడి చదివి నేవీ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. చిన్నతనం నుంచే దేశసేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగిన సన్నీ, తన కలను నిజం చేసుకున్నాడు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువకులు హాజరై సన్నీకి శాలువా అభినందనలు తెలిపారు. గ్రామానికి గర్వకారణంగా నిలిచిన సన్నీని చూసి తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ… పేద కుటుంబం నుంచి వచ్చి నేవీలో సెలెక్ట్ కావడం మేడారం గ్రామానికే గర్వకారణమని అన్నారు. సన్నీని ఆదర్శంగా తీసుకుని గ్రామ యువత కూడా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. సన్నీ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 29 November 2026, 12:50 pm Posted by : TELANGANA VANI

పేదరికాన్ని జయించి నేవీలో కొలువు… మేడారం బిడ్డ సన్నీకి ఘన సన్మానం

 ధర్మారం, (తెలంగాణ వాణి ప్రతినిధి )
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం గ్రామానికి చెందిన పేద కుటుంబానికి చెందిన యువకుడు ఎల్తూరి సన్నీ భారత నావీ (నేవీ) లో ఉద్యోగం సాధించిన సందర్భంగా గ్రామస్తులు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

పేదరికం, ఎన్నో ఇబ్బందుల మధ్య కూడా సన్నీ చదువుపై దృష్టి పెట్టి, పట్టుదలతో కష్టపడి చదివి నేవీ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. చిన్నతనం నుంచే దేశసేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగిన సన్నీ, తన కలను నిజం చేసుకున్నాడు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువకులు హాజరై సన్నీకి శాలువా అభినందనలు తెలిపారు. గ్రామానికి గర్వకారణంగా నిలిచిన సన్నీని చూసి తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ... పేద కుటుంబం నుంచి వచ్చి నేవీలో సెలెక్ట్ కావడం మేడారం గ్రామానికే గర్వకారణమని అన్నారు. సన్నీని ఆదర్శంగా తీసుకుని గ్రామ యువత కూడా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. సన్నీ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest