UPDATES  

NEWS

 దీక్షా దివస్ సభ ఏర్పాట్లపై నేతల పర్యవేక్షణ

తిమ్మాపూర్‌ నవంబర్ 24( తెలంగాణ వాణి ప్రతినిధి ) :ఈ నెల 29న అలుగునూర్‌లో నిర్వహించనున్న దీక్షా దివస్ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సభను ఘనంగా నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లను బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరిశీలించారు. సభా ప్రాంగణంలో కొనసాగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. సభకు వచ్చే పార్టీ శ్రేణులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సభ విజయవంతానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని ఏర్పాట్లలో భాగస్వాములు కావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్‌సింగ్, బీఆర్‌ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు రావుల రమేష్, అలుగునూర్ కార్పొరేటర్ కాల్వ మల్లేశం, పాశం అశోక్‌రెడ్డి, సల్ల మహేందర్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 24 November 2026, 7:08 pm Posted by : TELANGANA VANI

దీక్షా దివస్ సభ ఏర్పాట్లపై నేతల పర్యవేక్షణ

తిమ్మాపూర్‌ నవంబర్ 24( తెలంగాణ వాణి ప్రతినిధి ) :ఈ నెల 29న అలుగునూర్‌లో నిర్వహించనున్న దీక్షా దివస్ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సభను ఘనంగా నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లను బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరిశీలించారు. సభా ప్రాంగణంలో కొనసాగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. సభకు వచ్చే పార్టీ శ్రేణులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సభ విజయవంతానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని ఏర్పాట్లలో భాగస్వాములు కావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్‌సింగ్, బీఆర్‌ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు రావుల రమేష్, అలుగునూర్ కార్పొరేటర్ కాల్వ మల్లేశం, పాశం అశోక్‌రెడ్డి, సల్ల మహేందర్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest