UPDATES  

NEWS

 తల్లాడ మేజర్ పంచాయతీలో వనమహోత్సవం

తల్లాడ, ఆగష్టు 25 (తెలంగాణ వాణి):

తల్లాడ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో వనమహోత్సవం కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ,హరితహారం లక్ష్యంగా మండల కేంద్రంలో విస్తృతంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ఓ) ఉమా, తాసిల్దార్ టీ కరుణాకర్ రెడ్డి, ఎంపీడీవో శ్రీధర్ రాజు, తల్లాడ గ్రామ సర్పంచ్ పెరిక నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ కర్నాటి లక్ష్మారెడ్డి, హాజరై మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉమా తాసిల్దార్ కరుణాకర్ రెడ్డి, మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో వృక్షాల పాత్ర కీలకమన్నారు. అనంతరం సర్పంచ్ పెరిక నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గ్రామాన్ని హరిత గ్రామంగా మార్చేందుకు పంచాయతీ పాలకవర్గం నిరంతరం కృషి చేస్తోందని, నాటిన ప్రతి మొక్కను రక్షించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు, సెక్రటరీ, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటారు…

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 26 August 2026, 8:18 am Posted by : TELANGANA VANI

తల్లాడ మేజర్ పంచాయతీలో వనమహోత్సవం

తల్లాడ, ఆగష్టు 25 (తెలంగాణ వాణి):

తల్లాడ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో వనమహోత్సవం కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ,హరితహారం లక్ష్యంగా మండల కేంద్రంలో విస్తృతంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ఓ) ఉమా, తాసిల్దార్ టీ కరుణాకర్ రెడ్డి, ఎంపీడీవో శ్రీధర్ రాజు, తల్లాడ గ్రామ సర్పంచ్ పెరిక నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ కర్నాటి లక్ష్మారెడ్డి, హాజరై మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉమా తాసిల్దార్ కరుణాకర్ రెడ్డి, మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో వృక్షాల పాత్ర కీలకమన్నారు. అనంతరం సర్పంచ్ పెరిక నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గ్రామాన్ని హరిత గ్రామంగా మార్చేందుకు పంచాయతీ పాలకవర్గం నిరంతరం కృషి చేస్తోందని, నాటిన ప్రతి మొక్కను రక్షించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు, సెక్రటరీ, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటారు...

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest