UPDATES  

NEWS

అందరూ సోదర భావంతో ముందుకు సాగుదామని,ఇఫ్తార్ విందులో జర్పుల మురళీ నాయక్ విన్నూత్న బహుకరణతో ఆకట్టుకున్న ఈఈ మధుకర్ – రాజ్యాంగ గ్రంథం అందజేతపై చైర్మన్ ప్రశంసలు రేగళ్ల గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తాండ్ర మధుకర్  ఐక్య తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో పట్టెడన్నం కార్యక్రమం ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫా అందజేసిన టిఎన్ఆర్ ట్రస్ట్ ప్రపంచ కార్మిక వర్గానికి మార్గదర్శకుడు కారల్ మార్క్స్ : ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్వంచలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌కు ప్రముఖుల హాజరు బడ్జెట్‌లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావుకు AISF వినతి సర్వారాం గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా శుభ్రత కార్యక్రమం: సర్పంచ్ భూక్యా సునీత రాంబాబు గొందిగూడెం పాఠశాలలో అభివృద్ధి పనులకు భూమిపూజ… మినీ ఆర్వో ప్లాంట్ ప్రారంభం

 ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఎడారి దేశంలో భారీవానలు..వరదలు చూసి తీరాల్సిందే

అది ఒక ఎడాది దేశం.. మండే ఎండలు తప్ప వాన చినుకు ఏడాది రెండేళ్లకు ఒకసారి కూడా రాలదు. వర్షపు చినుకు కోసం ఏళ్లకు ఏళ్లు అక్కడి ప్రజలు ఎదురు చూస్తారు.

కానీ, అలాంటి దేశం ఇప్పుడు భారీ వర్షాలకు అతలాకుతలమవుతోంది. వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జనజీవనం స్తంభించింది. రోడ్లు నదులుగా మారాయి. రోడ్లపై వరద చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. విమానాల రాకపోకలకూ అంతరాయం ఏర్పడింది.

దుబాయ్‌లో భారీ వర్షాలు..
ప్రపంచంలో చోటుచేసుకుంటున్న వాతావణ మార్పులకు దుబాయ్‌ అద్దం పడుతోంది. ఎటు చూసినా ఇసుక దిబ్బలు.. తవ్వితే ఆయిల్‌ తప్ప చుక్క నీరు రాని ఎడాది దేశం దుబాయ్‌. అలాంటి దేశం ఇప్పుడు వర్షాలు, వరదలతో అతలాకులమవుతోంది. విస్తుగొలిపే అంశమే అయినా తాజాగా దుబాయ్‌లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో రోడ్లపై నీరు నిలిచింది. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. విమానాల రాకపోకలకూ అంతరాయం కలిగింది. కొన్నింటిని దారి మళ్లించారు. కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.

శనివారం తెల్లవారుజాము నుంచి..
దుబాయ్‌లో శనివారం తెల్లవారుజాము నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై వర్షం కురుస్తోంది. ఈమేరకు అక్కడి వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. దుబాయ్‌లో ఏడాది సగటు వర్షపాతం 120 మిల్లీమీటర్లు. శనివారం ఆరు గంటల్లో 50 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి అక్కడి చెట్లు విరిగిపడ్డాయి. స్పందించిన అధికారులు హుటాహుటిన రెస్క్యూ సిబ్బందిని రంగంలోకి దించారు. విచిగిన చెట్లు తొలగించారు. డ్రెయినేజీలు ఖాళీ చేయించారు.

ట్రాఫిక్‌కు అంతరాయం..
భారీ వర్షాలకు దుబాయ్‌లోని ప్రధాన రహదారులపై వరద చేరడంతో నదులను తలపిస్తున్నాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. మరోవైపు ఆదివారం కూడా పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అస్థిర వాతావరణం క్రమంగా బలహీనపడి.. ఆదివారం సాయంత్రానికి వర్షం తూర్పు ప్రాంతాలకే పరిమితమవుతుందని వెల్లడించింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest