UPDATES  

NEWS

భైంసాలో ఘనంగా దీక్షా దివస్ వేడుకలు మంత్రి చేతుల మీదుగా ఉప సర్పంచ్ ల ఫోరం భారీ బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ పేదరికాన్ని జయించి నేవీలో కొలువు… మేడారం బిడ్డ సన్నీకి ఘన సన్మానం దుర్గామాత ఆలయంలో చోరీ – వెండి హారాలు, బంగారు ముక్కుపుడక ఎత్తుకెళ్లిన దొంగలు దుర్గామాత ఆలయంలో చోరీ – వెండి హారాలు, బంగారు ముక్కుపుడక ఎత్తుకెళ్లిన దొంగలు ఉద్యోగులు, పెన్షనర్లు ఆరోగ్య పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఫ్లెక్సీ ఫైటింగ్‌..అల్గునూర్‌లో అగ్గి డిసెంబర్ 1న నిర్మల్‌లో TUWJ-IJU జిల్లా 3వ మహాసభలు రేణికుంట బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం అంబేద్కర్ విగ్రహానికి మరమ్మతులు.. కొత్త రంగులు వేయించేందుకు చర్యలు

 ఉద్యోగులు, పెన్షనర్లు ఆరోగ్య పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్

నిర్మల్ – భైంసా: ప్రభుత్వ ఉద్యోగులు,విశ్రాంత ఉద్యోగులు,పెన్షనర్లు నూతనంగా ప్రవేశపెట్టిన ఉద్యోగుల ఆరోగ్య పథకం (NEHS) సేవలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని జీడీఆర్ మెమోరియల్ కృష్ణ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ పిలుపునిచ్చారు.

భైంసా పట్టణంలోని పెన్షనర్ల భవన్‌లో నిర్వహించిన పెన్షనర్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జీడీఆర్ మెమోరియల్ కృష్ణ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు.ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.పథకంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను అవసరమైనప్పుడు వినియోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు నాగనాథ్, ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రావు, అసోసియేట్ అధ్యక్షుడు మాణిక్‌రావు,రమేశ్,జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ పోశెట్టి,రిటైర్డ్ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ దామోదర్‌రెడ్డి,జీడీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ముఖ్య సలహాదారు పుండలిక్ రావు,పీఆర్వో రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 29 November 2026, 12:39 pm Posted by : TELANGANA VANI

ఉద్యోగులు, పెన్షనర్లు ఆరోగ్య పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్
నిర్మల్ – భైంసా: ప్రభుత్వ ఉద్యోగులు,విశ్రాంత ఉద్యోగులు,పెన్షనర్లు నూతనంగా ప్రవేశపెట్టిన ఉద్యోగుల ఆరోగ్య పథకం (NEHS) సేవలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని జీడీఆర్ మెమోరియల్ కృష్ణ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ పిలుపునిచ్చారు.

భైంసా పట్టణంలోని పెన్షనర్ల భవన్‌లో నిర్వహించిన పెన్షనర్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జీడీఆర్ మెమోరియల్ కృష్ణ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు.ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.పథకంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను అవసరమైనప్పుడు వినియోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు నాగనాథ్, ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రావు, అసోసియేట్ అధ్యక్షుడు మాణిక్‌రావు,రమేశ్,జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ పోశెట్టి,రిటైర్డ్ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ దామోదర్‌రెడ్డి,జీడీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ముఖ్య సలహాదారు పుండలిక్ రావు,పీఆర్వో రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest