హైదరాబాద్ (తెలంగాణ వాణి ప్రతినిధి)
మెదక్-నిజామాబాద్- కరీంనగర్- ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి శనివారం సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రుల బృందాన్ని హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు, అందుకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, సహకరించిన మంత్రులకు నరేందర్ రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తే తప్పక విజయం సాధించి తీరుతానని ఈ సందర్భంగా ఆయన వారికి హామీ ఇచ్చారు. నరేందర్ రెడ్డి కలిసిన వారిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, జిల్లాకు చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, దుదిల్ల శ్రీధర్ బాబు, జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు.