కిన్నెరసాని గ్రామ పంచాయతీలో మహిళలలో దాగి ఉన్న కళాత్మక ప్రతిభను వెలికి తీసేందుకు ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు.సర్పంచ్ వజ్జ రామకృష్ణ,ఉపసర్పంచ్ వజ్జ ఇంద్రజా ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో యువతులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులతో ఆకట్టుకున్నారు. సంక్రాంతి సంప్రదాయాలను ప్రోత్సహిస్తూ మహిళల సృజనాత్మకతను వెలుగులోకి తేవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.మొదటి బహుమతి తాటి రామ, ద్వితీయ బహుమతి బోనగిరి శ్రీలత, తృతీయ బహుమతి బుడగం హేమలతలకు దక్కాయి. బహుమతులను కొత్వాల శ్రీనివాస్ అందజేశారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను వజ్జ శ్యామ్ దంపతులు స్పాన్సర్ చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు వార్డ్ మెంబర్లు,నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
Post Views: 79
