భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గణేష్ టెంపుల్ ఏరియాలో ఉన్న యామిని హాస్పిటల్‌ను దమ్మపేట గురుకుల పాఠశాల మిత్రులు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ నరసింహ జీవన్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.మిత్రులు మాట్లాడుతూ డాక్టర్ నరసింహ జీవన్ కుమార్ వైద్యరంగంలో చేస్తున్న సేవలు,ప్రజల పట్ల చూపుతున్న అంకితభావం ప్రశంసనీయమని పేర్కొన్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు మరింత మంచి వైద్యసేవలు అందించి మన్ననలను పొందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో దశరథ్, రాము,బాలు,మంగీలాల్ మరియు నాగేష్ పాల్గొన్నారు.
Post Views: 191


