పాల్వంచ మండలంలో ఎంపిపిఎస్ పాఠశాల రాజాపురంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఎనిమిదో రోజు పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు.పాఠశాల సమీపంలోని కాలువలు, డ్రైనేజీలు మూసుకుపోవడంతో నిల్వైన నీటిని ఉపాధ్యాయులు, గ్రామస్థులు కలిసి శుభ్రపరచి నీటి ప్రవాహం సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ వజ్జ రామకృష్ణ, సెక్రటరీ శ్రీనివాస్,పాఠశాల ఉపాధ్యాయులు, హెల్త్ వర్కర్లు, గ్రామస్థులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Post Views: 21