టేకులపల్లి మండలం జి కొత్త తండా గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తారాచంద్ పోటీ చేస్తున్నారు.అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా…మీ సమస్యలే నా సమస్యలుగా భావించి నిరంతరం ప్రజాసేవకు కృషి చేస్తానని కార్యకర్తలతో ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు.మీరందరూ పెద్ద మనసు చేసుకొని సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని భారీ ర్యాలీ నిర్వహించి,ప్రజలకు సేవ చేసే అవకాశం ఓటర్ల దేవుళ్ళు అవకాశం ఇవ్వాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఖీమా లాల్, వీరభద్రం,శ్రీను,నరేష్, ప్రేమ్ కుమార్ హిరాలాల్,లచ్చి రామ్,కొర్ర శ్రీను, బి.నరేష్,గణేష్,కాంగ్రెస్ కార్యకర్తలు స్థానిక ప్రజలు,మహిళలు మరియు యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 227