UPDATES  

NEWS

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి.మధుకర్ సుడిగాలి పర్యటన కవిత దీక్షకు మద్దతు తెలిపిన బిరుదురాజు వెంకటేశ్వర రాజు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని సత్కరించిన ఎమ్మెల్యే కూనంనేని కేజీబీవీ,యుఆర్ఎస్,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి:టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి డిఎస్.నాగేశ్వరరావు చంద్రు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ బండపల్లిలో విద్యుత్ సెగకు నిరుపేద ఇల్లు బుగ్గి: సర్వం కోల్పోయి వీధిన పడ్డ కుటుంబం కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన త్రాగిన మైకంలో యాక్సిడెంట్ చేసి ఇద్దరు మృతులకు కారణమైన అంబులెన్స్ డ్రైవర్ కు10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష కూలీలైన్ మసీదు యూత్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు టి ఎస్ యు టి ఎఫ్ అద్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం

 ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి.మధుకర్ సుడిగాలి పర్యటన

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి. మధుకర్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. రాహుల్ ఐఎఎస్ ఆదేశాల మేరకు గిరిజన అభివృద్ధి పనులను వేగవంతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు.ఒకే రోజులో కిన్నెరసాని గురుకుల పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం స్పెషల్ ఆఫీసర్ హోదాలో కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్ను సందర్శించి హెచ్‌ఎం,ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులకు పరీక్షలపై భయపడకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని, మంచి మార్కులు సాధించాలని ప్రోత్సహించారు.ఇక భద్రాచలం గిరి మార్ట్ను శ్రీరామనవమి కంటే ముందే ప్రారంభించేందుకు ఈఈ బృందం కసరత్తు చేస్తోంది. షెడ్ నిర్మాణం,మరమ్మతులు, పెయింటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నట్లు తెలిపారు.తదుపరి కామేపల్లి మండలంలో రోడ్డు బ్రిడ్జి నిర్మాణ పనులను పర్యవేక్షించారు.అలాగే ఖమ్మం జిల్లా కేంద్రంలోని మహిళా మార్ట్ ఖమ్మంను సందర్శించి గిరి మార్ట్ నిర్వహణపై సలహాలు తీసుకున్నారు.భద్రాచలం గిరి మార్ట్‌ను మహిళా మార్ట్‌గా అభివృద్ధి చేసి విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest