ధర్మారం (తెలంగాణ వాణి) ధర్మారం ఆదర్శ పాఠశాల కళాశాలకు చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు వృత్తి వ్యాయామ విద్యకు సంబంధించి ఇంటర్నె డు శిక్షణ తీసుకుంటున్నారని ప్రిన్సిపల్ రాజ్ కుమార్ ఈరవేణి తెలిపారు. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. తెలంగాణ సమగ్ర శిక్ష ఒకేషనల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు కళాశాలకు చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ వ్యాయామ విద్య లెవెల్ నలుగురు విద్యార్థులు ఈ నెల 22 నుండి అక్టోబర్ 1 వరకు పది రోజుల ఇంటర్నెట్ షిప్ శిక్షణ ప్రారంభమైందని విద్యార్థులకు దిలీప్ ఫిజియోథెరపీ క్లినిక్ లో స్పోర్ట్స్ ఇంజురీస్, పెరాలసిస్, జాయింట్ మజిల్, ప్రాబ్లమ్స్, ఆక్యూట్, క్రానిక్ ఇంజురీస్, నివారణ చర్యల గురించి ఫిజియోథెరపీ పరికరాలను ఎలా ఉపయోగించాలనే శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. విద్యార్థులకు పుస్తకాల జ్ఞానంతో పాటు ప్రాక్టికల్ ఎంతో అవసరమని దసరా సెలవులలో విద్యార్థులు తమ సమయాన్ని వృధా చేయకుండా ఈ శిక్షణ కార్యక్రమంలో ఉపయోగించడం ద్వారా ప్రత్యక్షంగా ప్రాక్టికల్ స్కిల్స్ ని నేర్చుకోవడంతో భవిష్యత్తులో ఫిజియోథెరపీ రంగంలో స్థిరపడే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వృత్తి విద్యా వ్యాయామ ఉపాధ్యాయులు మేకల సంజీవరావు, విద్యార్థులు పాల్గొన్నారు.