UPDATES  

NEWS

ఓణీల శుభకార్యానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించిన ఐక్య తల్లిదండ్రుల సంఘం నాయకులు. మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం : వజ్జా ఈశ్వరి మృతుడి కుటుంబానికి 5వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి

 హుస్నాబాద్‌లో జీవో 317 బాధితుల ముందస్తు అరెస్టులు

పండుగ పూట ఉపాధ్యాయుల ఇబ్బందులు

​సిద్దిపేట/హుస్నాబాద్: (తెలంగాణ వాణి స్టేట్ కోఆర్డినేటర్) సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పరిధిలో నివసిస్తున్న జీవో 317 ప్రభుత్వ ఉపాధ్యాలను హుస్నాబాద్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు. జీవో 317 ద్వారా బదిలీకాని ఉద్యోగులందరినీ స్థానికత ఆధారంగా బదిలీ చేయాలనే డిమాండ్‌తో వారు శనివారం హైదరాబాద్ సెక్రటేరియట్ ముందు ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే జీవో 317 ద్వారా ‘డిస్లొకేట్’ అయి బాధితులు అయిన ఉపాధ్యాయులను అరెస్టు చేయడం పట్ల పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు బూట్ల రాజామల్లయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 317 బాధితులందరినీ ఒకే రకంగా చూడడం సరికాదని ఆయన అన్నారు. ఇటీవల ప్రభుత్వం జీవో 190 విడుదల చేసినప్పటికీ, ముందస్తు అరెస్టులు చేయడంలో అర్థం లేదని రాజామల్లయ్య ఖండించారు. భవిష్యత్తులో ఇలాంటి అరెస్టులు చేయడం పోలీసులు మానుకోవాలని ఆయన సూచించారు. అరెస్టైన వారిలో ఉపాధ్యాయులు కక్కెర్ల రవీందర్, కాయిత శ్రీనివాస్ రెడ్డి అయిల బాలకిషన్ లు ఉన్నారు. ఈ అరెస్టుల కారణంగా పండుగ పూట ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలుస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest