ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని కటికనపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమానులు బుధవారం సమావేశం ఏర్పాటు చేసుకున్నారు, అనంతరం ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్స్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్య సలహాదారుగా జంగిలి కిషోర్, గౌరవ అధ్యక్షునిగా రామడుగు గంగారెడ్డి, అధ్యక్షులుగా మానుపాటి సాయిలు, ఉపాధ్యాక్షులుగా ఐలవేణి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా బల్ల శ్రీనివాస్, కోశాధికారిగా అనపురం వెంకటేష్, కార్యవర్గ సభ్యులుగా ఎత్తరి రమేష్, బుగ్గ శంకర్, అనపురం సంజీవ్, సామంతుల స్వామి, ఉత్తం కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం అధ్యక్షులు మానుపాటి సాయిలు మాట్లాడుతూ ట్రాక్టర్ అసోసియేషన్ లో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
Post Views: 2,358