UPDATES  

NEWS

 సెల్ టవర్ ఎక్కి ఆత్మ హత్యయత్నం

సైదాపూర్ (తెలంగాణ వాణి)

మండలంలోని ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన దుర్గం కనుకయ్య కుటుంబ కలహాలతో శంకరపట్నం మండలంలో సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్ లు వచ్చి సముదాయించగా సెల్ టవర్ నుండి దిగాడు. దీనికి సంబందించిన వివరాల్లోకి వెళ్తే దుర్గం కనుకయ్య కు అతని చిన్న సోదరుడు తిరుపతికి కనుకయ్యకు మధ్య గత కొంత కాలంగా భూవివాదం ఉంది. ఇల్లు కూలగొట్టి తన భార్యను కొట్టడంతో ఆమె పురుగుల మందు తాగి ఆత్మ హత్యాయత్నం చేయగా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని తిరిగి ఇంటికి వచ్చింది. ఈ వివాదం పరిష్కారం చేయాలని పోలీస్ కమీషనర్ కరీంనగర్, సైదాపూర్ ఎస్సై లకు ఫిర్యాదు చేసినప్పటికి ఎవరు పట్టించు కోవడం లేదని ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్టు భాధితుడు తెలిపాడు. ఇప్పటికైనా అధికారులు సమస్యను పరిష్క్కరించాలని, లేకపోతే చావే మార్గమంటూ వాపోయాడు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest