UPDATES  

NEWS

 తెలంగాణ వాణి జర్నలిస్ట్ కు రాష్ట్రస్థాయి గౌరవం

మహాత్మ జ్యోతిరావు పూలే జాతీయ ఐకాన్ అవార్డు – 2025 అందుకున్న పిల్లి రవికిరణ్, మహమ్మద్ ఖాసీం, క్రాంతి కుమార్

మంచిర్యాల (తెలంగాణవాణి జిల్లా ప్రతినిధి)

మంచిర్యాల జిల్లా జర్నలిస్టులు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆదివారం రాజమండ్రిలో అభిలాష హెల్పింగ్ హ్యాండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన మహాత్మ జ్యోతిరావు పూలే జాతీయ ఐకాన్ అవార్డు కార్యక్రమంలో ఉత్తమ జర్నలిస్టుల విభాగంలో రామకృష్ణాపూర్‌కు చెందిన తెలంగాణవాణి జర్నలిస్ట్ పిల్లి రవికిరణ్ తో పాటుగా మందమర్రి ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఖాసీం, క్రాంతి కుమార్ మహాత్మ జ్యోతిరావు పూలే జాతీయ ఐకాన్ అవార్డు – 2025ను అందుకున్నారు. ప్రజల సమస్యలను, సామాజిక అంశాలను స్పష్టంగా ప్రజల ముందుకు తీసుకురావడంలో చూపిన నిబద్ధతకు గుర్తింపుగా వీరికి అవార్డులు లభించాయి. అవార్డు అందుకున్న సందర్భంగా పలువురు జర్నలిస్టులు, స్నేహితులు, స్థానిక ప్రజలు వీరిని అభినందించారు. ఈ సందర్భంగా అవార్డు పొందిన రవికిరణ్, మహమ్మద్ ఖాసీం, క్రాంతి కుమార్ మాట్లాడుతూ, “ఈ గౌరవం తమ బాధ్యతను మరింతగా పెంచిందని, ప్రజల వాస్తవ పరిస్థితులను వెలికి తీసేందుకు, న్యాయంగా సమాచారం అందించేందుకు కృషి చేస్తాం” అని తెలిపారు. ఈ అవార్డులతో మంచిర్యాల జిల్లా జర్నలిస్టులకు రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించినట్లు పలువురు వ్యాఖ్యానించారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
9703247143
telanganavanidaily.com
Date of Publish : 28 April 2025, 12:16 pm Posted by : TELANGANA VANI

తెలంగాణ వాణి జర్నలిస్ట్ కు రాష్ట్రస్థాయి గౌరవం

మహాత్మ జ్యోతిరావు పూలే జాతీయ ఐకాన్ అవార్డు - 2025 అందుకున్న పిల్లి రవికిరణ్, మహమ్మద్ ఖాసీం, క్రాంతి కుమార్
మంచిర్యాల (తెలంగాణవాణి జిల్లా ప్రతినిధి)

మంచిర్యాల జిల్లా జర్నలిస్టులు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆదివారం రాజమండ్రిలో అభిలాష హెల్పింగ్ హ్యాండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన మహాత్మ జ్యోతిరావు పూలే జాతీయ ఐకాన్ అవార్డు కార్యక్రమంలో ఉత్తమ జర్నలిస్టుల విభాగంలో రామకృష్ణాపూర్‌కు చెందిన తెలంగాణవాణి జర్నలిస్ట్ పిల్లి రవికిరణ్ తో పాటుగా మందమర్రి ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఖాసీం, క్రాంతి కుమార్ మహాత్మ జ్యోతిరావు పూలే జాతీయ ఐకాన్ అవార్డు - 2025ను అందుకున్నారు. ప్రజల సమస్యలను, సామాజిక అంశాలను స్పష్టంగా ప్రజల ముందుకు తీసుకురావడంలో చూపిన నిబద్ధతకు గుర్తింపుగా వీరికి అవార్డులు లభించాయి. అవార్డు అందుకున్న సందర్భంగా పలువురు జర్నలిస్టులు, స్నేహితులు, స్థానిక ప్రజలు వీరిని అభినందించారు. ఈ సందర్భంగా అవార్డు పొందిన రవికిరణ్, మహమ్మద్ ఖాసీం, క్రాంతి కుమార్ మాట్లాడుతూ, "ఈ గౌరవం తమ బాధ్యతను మరింతగా పెంచిందని, ప్రజల వాస్తవ పరిస్థితులను వెలికి తీసేందుకు, న్యాయంగా సమాచారం అందించేందుకు కృషి చేస్తాం" అని తెలిపారు. ఈ అవార్డులతో మంచిర్యాల జిల్లా జర్నలిస్టులకు రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించినట్లు పలువురు వ్యాఖ్యానించారు.

Generating image…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest