UPDATES  

NEWS

సాంకేతిక విజ్ఞానానికి వారధి… హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్! కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి హ్యాండ్ బోర్ మరమ్మతు – ప్రజల సమస్యకు తక్షణ పరిష్కారం:కార్పొరేటర్ కళావతిధనరాజ్ కాంగ్రెస్ నాయకులకు కాకులమర్రి లక్ష్మణ్ బాబు భయం పట్టుకుంది అంగన్‌వాడీల్లో ఒంటిపూట బడి అమలు పట్ల హర్షం వ్యక్తం చేసిన విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు హరిలాల్ నాయక్  సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతలకు ఘన సన్మానం:ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్, ఖబడ్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా రామ భక్త శ్రీ శ్రీ శ్రీ లాలు దాస్ అందరికి ఆదర్శం రక్తదానానికి యువత ముందుకు రావాలి: డీఎస్పీ ఆదినారాయణ ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ వరుణ్ కుమార్‌ కు మొక్కలు అందజేసిన

 తెలంగాణలో మరో ఉపఎన్నిక

తెలంగాణలో మరో ఉపఎన్నిక

కవిత రాజీనామాకు ఆమోదం

 

హైదరాబాద్ (తెలంగాణ వాణి) జాగృతి అధ్యక్షురాలు కవిత రాజీనామాకు ఆమోద ముద్ర పడింది. కవిత రాజీనామాను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. గతేడాది సెప్టెంబర్ 2న బీఆర్ఎస్ పార్టీ కవితను సస్పెండ్ చేసింది. ఆ వెంటనే 3వ తేదీన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కవిత ప్రకటించారు.

 

2022 జనవరిలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కవితకు 2028 వరకు పదవీ కాలం ఉంది. అయితే రెండున్నర సంవత్సరాల పదవీ కాలం ఉండగానే ఆమె రిజైన్ చేసేశారు. ఇప్పుడు కవిత రాజీనామాకు ఆమోద ముద్ర పడటంతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. కవిత రాజీనామాకు ఆమోదం లభించడంతో కౌన్సిల్‌లో ఓ స్థానం ఖాళీ అయినట్టు ఎన్నికల కమిషన్‌కు చైర్మన్ కార్యాలయం నుంచి సమాచారం వెళ్లింది. దీంతో ఆ స్థానం భర్తీ కోసం కొన్ని రోజుల్లోనే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.

 

స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాకే బైపోల్

 

కవిత రిజైన్ తో ఉపఎన్నిక అనివార్యమే అయినా స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాకే బైపోల్ జరిగే అవకాశం ఉంటుంది. ప్రజాప్రతినిధులు ఓటు వేయాలంటే మొదట స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా ఎంపిక కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఇటీవల పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. త్వరలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల కోసం సన్నాహాలు చేస్తోంది. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ లెక్కన నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఓటర్లు లేరు. దీనివల్ల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఇప్పుడే నిర్వహించడం సాధ్యం కాదు. మున్సిపల్ కార్పొరేటర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటు వేయాల్సి ఉంటుంది కాబట్టి.. పరిషత్‌ ఎన్నికలు ముగిశాకే… పాలక మండళ్లు కొలువుదీరిన తర్వాతే ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు కనీసం మూడు, నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం. బీఆర్‌ఎస్‌పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న కవిత తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, ఈ ఎన్నికల్లో ఆమె పోటీ చేయకపోవచ్చనే విశ్లేషణ వినిపిస్తోంది.

డిసెంబర్ నెలలో పంచాయతీ ఎన్నికలు ముగియడంతో రాష్ట్రంలో మిగతా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. తొలుత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికలు ముగియగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest