అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన హనుమకొండ జిల్లా తైక్వాండో క్రీడాకారులు
హైదరాబాద్/ఘట్కేసర్ (తెలంగాణ వాణి స్టేట్ కోఆర్డినేటర్) సెకండ్ ఓపెన్ తెలంగాణ స్టేట్ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు ఆదివారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలంలోని ఎదులాబాద్ డిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ ల్లో జరిగాయి.కాగా ఈ పోటీల్లో హనుమకొండ పట్టణం నుండి,తైక్వాండో హనుమకొండ జిల్లా సెక్రెటరీ గడ్డం వెంకటస్వామి కోచ్ మామునూరి సంపత్ ఆధ్వర్యంలో పలువురు క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.కాగ వీరిలో జూనియర్ అండర్ 68కేజీ కొరిగి(ఫైట్) లో భాషబోయిన అక్షయ,(బంగారు పతకం) జూనియర్ అండర్ 44, కేజీ మామునూరి స్రమజా సంపత్(కొరిగి) ఫైట్ లో బంగారు పతకం, జూనియర్ అండర్63,కేజీ పి.సంజయ్ కుమార్(కొరిగి)ఫైట్ లో బంగారు పతకం,జూనియర్ అండర్ 50,కేజీ శ్రీ రుద్రేశ్వరసాయి(కొరిగి)ఫైట్ లో బంగారు పతకం,సబ్ జూనియర్ అండర్32,కేజీ ఎ.సమృత కొరిగి మరియు పూమ్సే లో బంగారు పతకం, క్యాడేట్ అండర్ 32,కేజీ మామునూరి సహస్ర సంపత్ (పూమ్సే) లో బంగారు పతకం,అండర్48 కేజీ (కొరిగి)ఫైట్ లో బి.కృతిక్,సిల్వర్, మెడల్,అండర్32 కేజీ (కొరిగి)ఫైట్ లో ఎన్,అవినాష్ బంగారు పతకం,పి.వి అండర్ 20,కేజీ బి.విహన్ కొరిగి మరియు (పూమ్సే)సిల్వర్ అండ్ గోల్డ్ మెడల్ సాధించారు. ఈ పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ సిల్వర్ మెడల్స్ సాధించిన విద్యార్థిని విద్యార్థులను హనుమకొండ తైక్వాండో జిల్లా సెక్రటరీ గడ్డం వెంకటస్వామి అభినందించారు.రానున్న ఎస్.జి.ఎఫ్,సి.బి.ఎస్.ఈ. పోటీల్లో మరిన్ని బంగారు పతకాలు సాధించి, జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని దీంతో హనుమకొండ జిల్లాకు వన్నె తేవాలన్నారు. విద్యుత్ తో పాటు క్రీడల్లో ఉన్న ప్రాధాన్యత, తల్లిదండ్రులు గుర్తించి విద్యార్థులకు మరింత ప్రోత్సాహాన్ని అందించాలని ఆకాంక్షించారు.