UPDATES  

 స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : మల్లేశం

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) స్థానిక సంస్థల ఎన్నికలలో గేలుపే లక్ష్యంగా పనిచేయాలని యాదవ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మేకల మల్లేశం యాదవ్ ,యాదవ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సంధినేని రాజేందర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం అఖిల భారత యాదవ మహాసభ ధర్మారం మండల ఉపాధ్యక్షులు జీల్ల కనుకన్న అధ్యక్షతన ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నవంబర్ 24న ఉదయం10 లకు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల ఖాదర్ గూడెం అరబిందా ఫామ్ హౌస్ లో యాదవులకు రాజకీయ, పలు అంశాలపై శిక్షణ తరగతులు యాదవ సంఘాల ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ సౌగాని కొమరయ్య అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు జిల్లాలోని యాదవ సంఘాల నాయకులు హాజరు కావాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలలో యాదవులు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పిటిసి గా పోటీ చేసే వారందరికీ రాజకీయ నిపుణులతో ఒక్కరోజు శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీ చేసే అభ్యర్థుల యొక్క మెసేజ్లను విరివిగా వాట్స్అప్ గ్రూపులలో ప్రచారం చేయాలని సూచించారు .ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సీనియర్ నాయకులు ఆవుల ఐలయ్య యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల నాగరాజు, కమాన్పూర్ మాజీ వైస్ ఎంపీపీ ఉప్పరి శ్రీనివాస్, బత్తిని లక్ష్మణ్, మార్కెట్ డైరెక్టర్ ఈదుల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సంపత్, ఆవుల మల్లయ్య, జంగ మహేందర్, దారవేణి చిన్న ఓదేలు,తుమ్మల తిరుపతి, పొలం స్వామి, మిండ మహేందర్, కోల తిరుపతి , పొలం ప్రసాద్, పుట్ట మల్లేష్, పొలం శ్రీను తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest