UPDATES  

NEWS

ఇస్రో యువికా–26కు దరఖాస్తులు ఆహ్వానం: భద్రాది జిల్లా సైన్స్ అధికారి బి.సంపత్ కుమార్ భద్రాచలం డివిజన్ లో పి ఆర్ టి యు టి ఎస్ సమావేశం మండల స్థాయి బాల మేళా 2.0 విజయవంతం : ఎంఇఓ కృష్ణయ్య కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి – సాయి కుమార్ దంపతుల చేతుల మీదుగా నూతన పట్టు వస్త్రాలు బహుకరణ హోలీ పండుగను ఘనంగా జరుపుకున్న లక్ష్మీదేవిపల్లి పంచాయతీ సిబ్బంది కేజీబీవీ,యుఆర్‌ఎస్,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలపై మూడు దశల పోరాటం:టీఎస్‌యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు. రంగులమయమైన ఇండోర్ స్టేడియం: తైక్వాండో విద్యార్థుల హోలీ హంగామా ! నూతన జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టిఎస్ యు.టి.ఎఫ్ భద్రాది జిల్లా కమిటి  సేవాలాల్ సద్గురు చూపిన మార్గం ఆదర్శనీయం: వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్ నాయక్ పిడి బుగ్గ వెంకటేశ్వర్లు పదవీ విరమణ సందర్భంగా సన్మానించిన పి ఆర్ టి యు టి ఎస్ భద్రాద్రి జిల్లా కమిటీ

 రాష్ట్ర స్థాయి కబడ్డీ విజేతగా భద్రాద్రి జిల్లా బాలికల జట్టు

క్రీడాకారులను అభినందించిన కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్ 

వికారాబాద్‌ జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన 34వ సబ్‌ జూనియర్‌ అంతర్రాష్ట్ర బాలబాలికల కబడ్డీ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జట్టు సత్తా చాటింది. కాగా బాలికల జట్టును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ చీకటి కార్తీక్ అభినందించారు. వారికి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా చీకటి కార్తీక్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి జిల్లాలోని క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటేలా చేసేందుకు కృషి చేస్తున్నామని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహాయంతో జిల్లాలోని కబడ్డీ క్రీడాకారులకు సింథటిక్ మ్యాట్ తో కూడిన కబడ్డీ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తే స్పోర్ట్స్ కోటాలో భవిష్యత్ లో మంచి హోదాతో కూడిన ఉద్యోగాలు పొందే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, జాతీయ స్థాయిలో రాణించి భద్రాద్రి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌ జాయింట్ సెక్రటరీ – భద్రాద్రి జిల్లా సెక్రటరీ కె స్వాతిముత్యం, ట్రెజరర్ నరేష్, కోచ్ సిహెచ్ రాంబాబు, వెంకట్, యూత్ కాంగ్రెస్ నాయకులు గులాం మతిన్, కుంచం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest