టీపీసీసీ చీఫ్ కు మున్నూరు కాపు కులస్తుల వినతి
గాంధీభవన్ కు భారీగా తరలిన మున్నూరు కాపు ప్రతినిధులు.
నిజామాబాద్ (తెలంగాణ వాణి) కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్ కి కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి కేటాయించాలని మున్నూరు కాపు కులానికి చెందిన ప్రతినిధులు కోరారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా నుండి పెద్ద ఎత్తున సోమవారం హైదరాబాద్ లోని గాంధీభవన్ కు తరలి వెళ్లారు. టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అందుబాటులో లేకపోవడంతో గాంధీభవన్ ఇంచార్జ్ టీపీసీసీ ఉపాధ్యక్షులు కుమార్ రావుకు వినతి పత్రం అందజేశారు. మహేష్ కుమార్ గౌడ్ కు తమ ఆవేదనతో కూడిన వినతి పత్రాన్ని అందించాలని కోరారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లాలో సుమారు 4,50,000. మంది మున్నూరు కాపు ఓటర్లు ఉన్నారని గుర్తు చేశారు. గత 12 సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాలో మాకు సరైన రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా పోయిందని వినతి పత్రంలో ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా ప్రతినిధులు వెల్లడించారు.. పార్టీలకతీతంగా మున్నూరు కాపు సోదరులందరం, సోదరిమనులందరు ఏకమై మేము మీకు విన్నవించుకున్నది ఏమనగా మా జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ కి మీరు ఏదైనా గౌరవప్రదమైన పదవి ఇచ్చి మున్నూరు కాపుల అభ్యున్నతికి నాంది పలకాలని మనవి అని తెలియపరిచారు. సంజయ్ గతంలో మేయర్ గా పని చేశారని, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో క్రియాశీలకంగా నిజామాబాద్ కార్పొరేషన్ ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా పనిచేశారని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపులకు ఇచ్చిన ప్రాతినిధ్యాన్ని ఎన్నటికీ మర్చిపోమని మున్నూరు కాపు సోదరసోదరిమనులం అందరo ఏకగ్రీవంగా కోరుకుంటున్నామన్నారు. మున్నూరు కాపు సోదరులు అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడతామని, మా అందరికీ నాయకత్వం వహిస్తున్న మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ కి కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి అప్పగించి మున్నూరు కాపులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరారు. నిజామాబాద్ జిల్లా నుండి గాంధీభవన్ కు తరలి వెళ్లిన వారిలో మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు, కార్యకర్తలు ఉన్నారు.