UPDATES  

 నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసు.. నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్

హైదరాబాద్  (తెలంగాణ వాణి) నిజామాబాద్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్న రౌడీ షీటర్ ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. చిక్సిత పొందుతున్న రియాజ్ హాస్పిటల్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని పోలీసులపై కాల్పులు చేయడానికి ప్రయత్నించాడు రౌడీ షీటర్ రియాజ్. సెక్యూరిటీగా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ తీవ్ర గాయాలైయ్యాయి. కానిస్టేబుల్ హత్య కేసులో రియాజ్ నిందితుడిగా ఉన్నాడు. రెండు రోజుల క్రితం సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను రియాజ్ కత్తితో పొడిచి పారిపోయారు. కొన్ని రోజుల క్రితం నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ చావుకు కారణమైన రియాజ్ ను పోలీసులు ఆదివారం గాయాలతో అదుపులోకి తీసుకున్నారు. ఓ యువకుడితో ఘర్షణలో రియాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని అరెస్ట్ చేసి.. హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. బీబీహెచ్లో చికిత్స పొందుతూ తప్పించుకోడానికి ప్రయత్నించాడు. నిన్న రౌడీ షీటర్ రియాజ్ పోలీసుల కాల్పుల్లో చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. దీంతో సీపీ స్పందించి రియాజ్ చనిపోలేదని ప్రకటించారు. మరో వ్యక్తితో జరిగిన ఘర్షణలో రియాజ్ తీవ్రంగా గాయపడ్డాడని ఆయన తెలిపారు. చికిత్స నిమిత్తం రౌడీ షీటర్ రియాజ్ను హాస్పిటల్కు తరలించారు.

 

హాస్పిటల్లో సోమవారం ఉదయం పోలీసుల నుంచి అతడు తప్పించుకోడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో పోలీసులు అతనిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాపాలాగా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని ఫైరింగ్ చేయబోయాడని, రియాజ్ గన్ ఫైర్ చేసి ఉంటే ప్రజల ప్రాణాలు పోయేవని, ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఎన్‌కౌంటర్‌ జరిపిన్నట్టు  డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.

 

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest