బోథ్ (తెలంగాణా వాణి ప్రతినిధి) ఇచ్చోడ మండలం దాబా కె గ్రామంలోని అంబేద్కర్ భవన్ వద్ద అక్టోబర్ 7వ తారీకున మంగళవారం ధర్మచక్ర ప్రవర్తన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గణేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్, తమ గురువు సత్యపాల్ మహారాజ్ హాజరవుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. కావున పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
Post Views: 176



