UPDATES  

 రేపు దొంగతూర్థి గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం

ఇన్చార్జి తహసిల్దార్ ఉదయ్ కుమార్

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని దొంగతుర్తి గ్రామంలో సోమవారం ఉదయం 11 గంటలకు పౌరహక్కుల దినోత్సవం నిర్వహించనున్నట్లు ధర్మారం ఇన్చార్జి తహసిల్దార్ ఉదయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, అంటరానితనం రెండు గ్లాసుల విధానం పై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని కుల సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొనాలని కోరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest