ధర్మారం (తెలంగాణ వాణి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కరీంనగర్ రీజినల్ మేనేజర్ వారి ఆదేశాలనుసారం నాబార్డ్ వారి ఆర్థిక సహాయంతో ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం రచ్చపెల్లి గ్రామంలో నిర్వహించారు. ఇందు లో భాగంగా రాజమహేంద్రవరం భూపతి బ్రదర్స్ కళాజాత బృందం వారిచే వీధి నాటిక జానపద గీతాలు, మ్యాజిక్ షో ద్వారా ప్రజలకు అవగాహన తెలియపరుస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేక బ్రాంచ్ లలో, గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు బ్యాంకు స్కీమ్స్ పై కేంద్ర ప్రభుత్వం అందించే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన 436, ప్రధానమంత్రి సురక్ష యోజన 20 రూపాయలు, అటల్ పెన్షన్ యోజన పథకం, సమృద్ధి యోజన పథకం, ఎన్ పి ఎస్ వాచాల్య ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్, సైబర్ మోసాల నుండి జాగ్రత్తలు వహించి ఓటిపి ఎవరికి తెలియపరచవద్దు అని డిజిటల్ అరెస్టులు నమ్మవద్దు అని, ఏపీకే ఫైల్స్ బ్లూరంగులో ఉండే యాప్ ను ప్రెస్ చేయవద్దని ఆన్లైన్ యాప్ లను డౌన్లోడ్ చేయవద్దని కళాకారులు ప్రజలకు అవగాహన తెలుపుతూ ప్రచారం చేయడం జరుగుతుందని దొంగతూర్తి బ్యాంక్ మేనేజర్ రాహుల్ అన్నారు, ఈ కార్యక్రమంలో రచ్చపెల్లి సర్పంచ్ సుర సుజాత-వెంకటేశం, రైతులు తదితరులు పాల్గొన్నారు.

