మల్లాపూర్ (తెలంగాణ వాణి) మండలంలోని ముత్యంపేట గ్రామపంచాయతీని కౌన్సిల్ ఫర్ సిటిజన్ సభ్యుడు కట్టెకోల వివేకానంద సందర్శించారు. ఈ సందర్భంగా వివేకానంద మాట్లాడుతూ సిసిఆర్ సంస్థ ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీలలో ఒకటి సెప్టెంబర్ రోజున సమాచార హక్కు చట్టం బోర్డులను, అవినీతి నిరోధక శాఖ అధికారుల ఫోన్ నెంబర్లతో సహా బోర్డులను అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలలో పెట్టాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. కానీ కొన్ని పంచాయతీ కార్యాలయాల్లో లేనందున సిసిఆర్ సంస్థకు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ముత్యంపేట పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి పంచాయతీ కార్యదర్శి మోబిన్ కు నిబంధనల ప్రకారం బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించినట్టు తెలిపారు.
Post Views: 138