ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి)
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలవనపర్తి గ్రామానికి చెందిన నక్క బీమమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలు వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానిక ఎస్సై శీలం లక్ష్మణ్ తెలిపారు. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు గత రెండేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ అనేక ఆసుపత్రిలలో చికిత్స చేపించుకున్న క్యాన్సర్ వ్యాధి నయం కాకపోవడంతో మనస్థాపం చెందిన నక్క భీమమ్మ దసరా రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తను ఉండే ఇంటికి దగ్గరలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. మృతురాలి కుమారుడు నక్క కొమురయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. కాగా భీమమ్మకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
Post Views: 111