UPDATES  

NEWS

 ఓడినా ప్రజల పక్షమే

గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యులు అవుతాం పుష్పలత తిరుపతి

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి) తనపై నమ్మకంతో బ్యాట్ గుర్తుపై ఓటు వేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మేడ వేణి పుష్పలత తిరుపతి కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికలలో గెలుపు ఓటములు సహజమని ఓడిన తాను తన భర్త ఎల్లవేళలా గ్రామ ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై పోరాడుతామని వెల్లడించారు. గెలిచిన సర్పంచ్ కు సహకరిస్తూ గ్రామ అభివృద్ధిలో పాలుపంచుకుంటామని తెలిపారు. ఓటమి తమకు ఎంతో నేర్పించిందని ప్రజా సమస్యలపై బాధ్యతాయుతంగా మరింత ముందుకు వెళ్తామని వెల్లడించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest