UPDATES  

NEWS

మృతుడి కుటుంబానికి 5వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి

 స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ (తెలంగాణ వాణి) స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ఇవాళ(సోమవారం) విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ తర్వాత వార్డులు, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. అక్టోబర్ 9వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఎన్నికల సంఘం. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం ఐదు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్ 9వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై నవంబర్ 11వ తేదీన ముగియనుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మీడియాకు వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. తాము టైమ్ షెడ్యూల్ ఖరారు చేసుకున్నామని వివరించారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీల ఖాళీల వివరాలు గెజిట్ నోటిఫికేషన్ నిన్న(ఆదివారం) తమకు అందిందని వెల్లడించారు. ఓటర్ల జాబితాను వార్డు, గ్రామం, ఎంపీటీసీ, జడ్పీటీసీ వారిగా పబ్లిష్ చేశామని తెలిపారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా తమ అధికారులు ప్రక్రియ పూర్తి చేశారని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని పేర్కొన్నారు…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest