ధర్మారం (తెలంగాణ వాణి) భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథ్ శుక్రవారం ధర్మపురి మండలం లో పర్యటించారు. ఈ సందర్భంగా బీజేపీ ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జి కన్నం అంజయ్య అంజయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొమ్ము రాంబాబు నేతృత్వంలో ధర్మారం మండల భాజాప శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికి ఆయనను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం రఘునాథ్ మాట్లాడుతూ బూత్ స్థాయి నుండి కార్యకర్తలను బలోపేతం చేయాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో వికసిత్ భారత్ గా ఈ దేశం అభివృద్ధి చెందుతుందని జోష్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మారం మండల బిజెపి సీనియర్ నాయకులు మేడ వేణి శ్రీనివాస్, సందనవేణి లక్ష్మణ్, మండల ప్రధాన కార్యదర్శిలు దేవి రాజలింగు, గోనె సాయి, ఐటీ సెల్ కన్వీనర్ కొక్కుల బాలకృష్ణ, బీజేవైఎం మండల శాఖ అధ్యక్షుడు మామిడి చందు, మండల ఉపాధ్యక్షులు దేవి కొమురేష్, మండల కార్యదర్శి పల్లె లక్ష్మణ్.చామనపల్లి వార్డు సభ్యులు మందపల్లి సాయిరాం, రాపల్లి శ్రీకాంత్, దాసరి సాగర్, సీనియర్ నాయకులు సామ రవీందర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, సాగంటి నరసయ్య, దండవేణి తిరుపతి, వేల్పుల తిరుపతి, శాఖ పురం వెంకటేష్, మేడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
